Bollywood : అంబానీ ఇంట ఏ వేడుక జరిగినా బాలీవుడ్ సెలబ్రిటీలు ఇట్టే వాలిపోతారు. గతంలోనూ అంబానీ పెద్ద కొడుకు, కూతురు వివాహ వేడుకల్లోనూ బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున హాజరై అంబానీల వేడుకలను కలర్‌ఫుల్‌గా మార్చారు. తాజాగా ఆంటిలీయాలో జరిగిన అంబానీ చిన్న కుమారుడు అనంత్, రాధిక మర్చంట్ ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, గౌరీ ఖాన్, ఆర్యన్ ఖాన్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. ఈ పార్టీ కోసం ఉత్తమమైన దుస్తులను ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చారు.

దీపికా పదుకొణె అందమైన ఎరుపు రంగు చీర కట్టుకుని మెడలో మందపాటి డైమండ్ నెక్లెస్ వేసుకుని వేడుకలో కలర్‌ఫుల్‌గా కనిపించింది. ఆమె పక్కనే రణవీర్ నల్లటి దుస్తుల్లో మెరిశాడు. పార్టీ కోసం లోపలికి వెళ్లే ముందు జంట తమ సాధారణ శైలిలో కెమెరాకు పోజులిచ్చారు.

గౌరీ ఖాన్ సిల్వర్ కలర్ అవుట్‌ఫిట్ వేసుకుని ధగధగా మెరిసిపోయింది.ఇక పూర్తిగా నలుపు రంగు సూట్‌లో ఉన్న కొడుకు ఆర్యన్‌తో కలిసి గౌరీఖాన్ కెమెరాకు పోజులిచ్చింది. ఆమె భర్త, నటుడు షారుఖ్ ఖాన్ కూడా నలుపు రంగులో కనిపించాడు.

కత్రినా కైఫ్ ఆకట్టుకునే షోల్డర్ ప్యాడ్స్‌తో తెల్లటి దుస్తులను ఈ ఈవెంట్ కోసం ధరించింది. భర్త విక్కీ కౌశల్ ఈవెంట్‌ను దాటవేయడంతో ఆమె ఫోటోగ్రాఫర్‌లకు ఒంటరిగా పోజులిచ్చింది.

నీలిరంగు కుర్తా పైజామా ధరించిన సల్మాన్ ఖాన్ సాయంత్రం జరిగిన ఈ వేడుకలో ప్రత్యేకమైన లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. అతని మేనకోడలు అలిజే అగ్నిహోత్రితో కలిసి కమెరా ముందు తళుక్కుమన్నాడు. అగ్నిహోత్రి ఈ వేడుకకోసం తెల్లటి లెహంగాను ధరించి అందంగా కనిపించింది.

ఇక బాలీవుడ్ యంగ్ సిస్టర్స్ జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు కూడా అద్భుతమైన లెహంగాలలో ఈ వేడుకలో కనిపించారు. ఖుషీ కపూర్ తెల్లటి లెహంగా ధరించి అదరగొట్టగా జాన్వీ కపూర్ లక్స్‌గ్రీన్ రంగులో భారీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన అద్భుతమైన లెహెంగా సెట్ వేసుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఎన్‌కోర్ హెల్త్‌కేర్ యొక్క సీఈఓ విరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్. గుజరాత్‌లోని కచ్ రాధిక స్వగ్రామం. ఆమె ఎనిమిదేళ్లు భరతనాట్యంలో శిక్షణ పొందింది. అంతే కాదు శ్రీ నిభా ఆర్ట్స్ గురు భావన థాకర్ శిష్యురాలు. జూన్ 2022లో, జియో వరల్డ్ సెంటర్‌లో అంబానీ కుటుంబం ఘనంగా ఆమె ఆరంగేట్రం వేడుకను నిర్వహించినప్పటి నుంచి రాధిక హెడ్‌లైన్స్‌లో నిలిచింది.

ఇక నీతా , ముఖేష్ అంబానీల కుమారుడు అనంత్, అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ నుండి తన చదువును పూర్తి చేసాడు. అప్పటి నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో జియో ప్లాట్‌ఫారమ్‌లు , రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డ్‌లలో సభ్యునిగా కూడా వివిధ హోదాలలో పనిచేశాడు. అతను ప్రస్తుతం RIL యొక్క ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నాడు.