కొడుకులకి పిల్లలు పుడితే వారిని ఎత్తుకొని సంతోషపడాలనే కోరికతో.. వారికి కొడళ్లతో శోభనం ఏర్పాటు చేస్తుంది జ్ఞానాంబ. కానీ అనుకున్న దానికి విరుద్ధంగా మల్లిక ప్లాన్ వల్ల అంతా వృథా అవుతుంది. జానకి, రామా మాత్రం శోభనాన్ని వాయిదా వేసుకుంటారు. జూలై 14 ఎపిసోడ్ లో ఏమైందంటే..
తెల్లారేసరికి జానకి కాళ్ల మీద రామా కాళ్లు వేసి ఉంటాడు. అది చూసి రామని లేపుతుంది జానకి. నిద్రలేవగానే తన పరిస్థితి చూసి రామా కంగారు పడతాడు. అదే సమయంలో జ్ఞానాంబ తలుపు కొడుతుంది. దీంతో జానకి గబగబ మంచం దిగి జుట్టు, బొట్టు చేరిపేసుకుంటుంది. తర్వాత తలుపు తీస్తుంది. జానకి అవతారం చూసి జ్ఞానాంబ సంతోషిస్తుంది. తల్లిలా అడుగుతున్నా అంటూ.. ఇద్దరి మనసులు కలిశాయా? సంతోషంగా గడిపారా? అని అడుగుతుంది.
త్వరలోనే నీ కడుపు పండాలి.. నా ఆశ తీరాలి.. నేను పాయసం చేస్తా మీరు రెడీ అవ్వండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్ఞానాంబ. మల్లిక చాటుగా వాళ్ల సంభాషణ విని.. ఓయమ్మో జానకికి శోభనం అయిపోయిందా? అని కంగారుపడిపోతుంది. ఇంతలో జ్ఞానాంబ తన వైపుకి రావడం చూసి.. మల్లిక కూడా జుట్టు, బొట్టు చెరిపేసుకుని ఏం చెప్పాలా? అని ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. జ్ఞానాంబ అడగకుండానే.. ఓవర్ యాక్షన్ చేస్తూ.. కార్యం అయ్యిందని అబద్ధం చెప్తుంది. మొత్తానికి నలిగిని పూలు.. చెరిగిన బొట్టు.. ఆ కార్యం జరిగిందని అత్తని నమ్మిస్తుంది మల్లిక.
జానకి లోపలికి వచ్చేసరికి.. రామాకి అంతా అయోమయంగా ఉంటుంది. తెల్లారేసరికి జానకిపై తన కాలు ఉండటం.. షర్ట్ నిండా లిప్ స్టిక్ ఉండటం చూసి.. జరగకూడనిది జరిగిందా? అని కన్ఫ్యూజన్లో ఉంటాడు. అది గమనించిన జానకి.. చిలిపిగా నవ్వుతూ.. రామాని ఆటపట్టిస్తుంది. ‘నా బట్టలపైకి మీ ముద్దుల మరకలు ఎలా వచ్చాయండీ’ అని రామా అడుగుతాడు.
చేయాల్సింది చేసేసి.. అమాయకంగా ముఖం పెట్టి అలా అడుగుతారేంటి? అని సరదాగా అంటుంది జానకి. ఏంటండీ మీరు? నేను ఏమి చేశాను. ఏం అంటున్నారో నాకు అర్ధం కావడంలేదని అమాయకంగా అంటాడు రామా. ‘మీరు మొదట ఐపీఎస్ పూర్తి చేయండి.. తర్వాత మిగతావి ఆలోచిద్దాం అని అన్నాను కదండీ.. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తుకు రావడం లేదు.. అసలేమైందో చెప్పండి అని రామా కంగారుగా చెబుతాడు.
అలాంటి విషయాలు అమ్మాయిని ఎలా చెప్తానండీ.. ముందు మీరు విశ్వామిత్రుడిలా సైలెంట్ ఉన్నారు.. కానీ ఆ మీలోని మన్మథుడు బయటికి వచ్చినట్టు ఉన్నాడు.. మా ఆయన్ని చూసి ఇన్ని రోజులు చాలా అమాయకుడు అనుకున్నా కానీ.. కానీ చిలిపికి చిరునామా? మైడియర్ రొమాంటిక్ రామా.. ప్రేమయాత్ర చేద్దామా? అంటూ రామాకి దగ్గరగా జరుగుతుంది. అదే సమయంలో పని మనిషి అక్కడికి రావడంతో దూరం జరుగుతారు. అయితే.. రామా అవతారం చూసి పని మనిషి పగలబడి నవ్వుతుంది. దీంతో రామా సిగ్గు పాడుతూ అక్కడి నుంచి చల్లగా జారుకుంటాడు. ఈ సిన్లో జానికి చిలిపిగా.. రామా అమాయకంగా జీవించేసి సన్నివేశాన్ని ఫన్నీగా మార్చేశారు.
ఇంకోవైపు జ్ఞానాంబ కొడుకులు కోడళ్లకి పాయసం సిద్ధం చేసి ఉంటుంది. దాన్ని గిన్నెల్లో వడ్డిస్తూ కొడుకులు, కోడళ్లని పిలుస్తుంది. అది విన్న వెంటనే జానకి, రామా వచ్చేస్తారు. కానీ మల్లిక మాత్రం మొబైల్లో గేమ్ ఆడుతూ కూర్చుంటుంది. అది చూసిన విష్ణు అమ్మ పిలుస్తుంటే కదలకుండా అల ఉన్నావెంటీ అని అడుగుతాడు. దానికి పిలవగానే వెళితే నాకు అత్తయ్య అంటే భయం అనుకుంటుంది. అందుకే ఓ పది నిమిషాల తర్వాత వెళదాం అంటుంది మల్లిక. కానీ అంతలోనే జ్ఞానాంబ పిలవడంతో భయపడుతూ వెళుతుంది.
జ్ఞానాంబ అప్పటికే సిద్ధం చేసినా పాయసం గిన్నెలు వారికి అందిస్తుంది. కొడుకు కోడళ్లకి స్వయంగా తినిపించి ప్రేమ కురిపిస్తుంది. సంతోషాన్ని పంచుకునేది తీపితోనే.. పైకి సంతోషంగానే ఉన్నా.. మనసులో దు:ఖాన్ని మోశాను.. ఈ ఇంట్లో పసి పిల్లల నవ్వుల కోసం ఎదురుచూడని రోజు లేదు. ఇప్పుడు నా కోడళ్ల కడుపు పండుతుందనే నమ్మకం కలిగించింది.. నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుందని భావోద్వేగంతో మాట్లాడుతుంది జ్ఞానాంబ.
అదే సమయంలో రామా జానకి వైపు చూస్తూ.. అమ్మకి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం మీరు ప్రయత్నిస్తున్నారు.. మీ నాన్నకి ఇచ్చినా మాట ప్రకారం మీ ఐపీఎస్ కలని నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చదువుకి ఆటంకం కలగనివ్వనని మనసులో అనుకుంటాడు రామా. మరోవైపు మల్లిక సైతం.. ఈరోజుకి మిస్ అయ్యింది కానీ.. జానకి కంటే ముందే పిల్లల్ని కనాలి.. తగ్గేదేలే.. ఈరోజు నుంచి అదే పనిలో ఉండాలని అనుకుంటుంది.
అనంతరం జ్ఞానాంబ ప్రశాంతమైన మనసుతో నా కోడళ్ల కడుపుపండేట్టు చేయి స్వామి.. కాలినడకన నీ కొండకు వచ్చి మొక్కు తీర్చుకుంటాను అని దేవుడిని కోరుకుంటుంది. అప్పుడే అటు వైపు వచ్చిన భర్త గోవిందరాజులుతో కొడుకు, కోడళ్ల శోభనం గురించి మాట్లాడుతుంది. మల్లిక కంటే ముందే జానకికి పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నట్లు చెబుతుంది. అది విని ఎవరికి పుడితే ఏంటని గోవిందరాజులు అడుగుతాడు. దానికి చిన్న కోడలికి ముందు పిల్లలు పుడితే.. పెద్ద కోడలికి ఏదో లోపం ఉందని అందరూ అనుకుంటారని అంటుంది జ్ఞానాంబ. ఆ బాధ జానకి తట్టుకోలేదని చెబుతుంది. వారి మధ్య జరుగుతున్న సంభాషణని చాటుగా విన్న జానకి చాలా ఎమోషనల్ అవుతుంది. అది విన్న జానకి ఏం చేస్తుందో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. తర్వాతి ఎపిసోడ్స్ లో చూడాలి.