ఎంతో నమ్మిన జానకి, రామా మోసం చేయడంతో తట్టుకోలేకపోతుంది జ్ఞానాంబ. కొడుకుని కోడలిని చడామడా తిట్టేస్తుంది. అనంతరం ఇంటికి వచ్చి తన గదిలోకి తలుపు వేసుకుంటుంది జ్ఞానాంబ. దీంతో ఏం జరుగుతుందా అని అందరూ ఎంతో భయంతో చూస్తూ ఉంటారు. ఆ తర్వాత జూలై 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
అమ్మకి కోపం వస్తే అప్పటికప్పుడు తిట్టేసి.. తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటుంది. ఆమెకి తగిలిన దెబ్బకి కుమిలిపోతూ ఉండొచ్చని, అందుకే అమ్మని ఒదార్చమని గోవిందరాజులుకి చెబుతారు కొడుకులు. వెళ్లి ఏదో ఒకటి మాట్లాడండి మామయ్యగారు అంటుంది జానకి. అది విని గోవిందరాజులు తలుపు కొట్టడానికి వెళుతుండగా.. అప్పుడే తలుపు తీసిన జ్ఞానాంబ అందరి వైపు ఒకసారి కోపంగా చూస్తుంది. ‘ఎందుకు అలా తలుపుల వంకే చూస్తున్నారు. నేను చనిపోయేంత పిరికిదాన్ని కాదు అని చెప్పను కదా’ అంటుంది జ్ఞానాంబ. అయితే అంతకుముందే జ్ఞానాంబ బయటికి వచ్చి రచ్చ చేస్తుందని, జానకి భరతం పడుతుంది చూడు అని పనిమనిషి చికితా దగ్గర జరగబోయేది ముందే ఊహించి చెబుతుంది మల్లిక. అందుకే అత్త బయటికి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి.. మా భయం అది కాదు అత్తయ్యగారు.. మీరు బయటికి వచ్చాక ఏం చేయబోతున్నారని తెలియక కంగారు పడుతున్నాం అంటుంది. దానికి.. ఏం లేదు రేపు మనింట్లో ప్రతి సంవత్సరంలాగే వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి. అందుకు ఏర్పాట్లు చేయండి అని కూల్‌గా చెప్పి తన గదిలోకి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. అది విని అందరూ ఊపిరి పీల్చుకొని ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోతారు. కానీ అత్త రియాక్షన్ చూసి షాక్‌కి గురవుతుంది మల్లిక. నేను అనుకున్నది ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి అనుకుంటూ తెగ బాధ పడిపోతుంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటీ అని పని మనిషి చికితా మల్లికను ఆటపట్టిస్తుంది.
మరోవైపు.. గదిలోకి వెళ్లిన జానకి జరిగిన విషయాన్ని తలుచుకుంటూ మదనపడి పోతుంది జానకి. అది చూసిన రామా అడగగా.. జ్ఞానాంబ మాట్లాడితే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని బాధపడుతుంది. అదే సర్టిఫికెట్స్ అవసరం అయిన రోజే నిజం చెప్పేసుంటే బావుండేదని.. గత రాత్రి వారి మధ్య జరిగిన సంభాషణని గుర్తు చేసుకుని బాధ పడుతుంటారు జానకి రామా. అది విన్న గోవిందరాజులు.. ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటారో చూడాలని దేవుడే మీకు ఈ పరీక్ష పెడుతున్నాడు. మీకంతా మంచే జరుగతుందని, ఏం భయపడొద్దని జానకి రామాకి దైర్యం చెబుతాడు.
మరుసటిరోజు ఉదయమే వెళ్లి పూజకి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొచ్చి జానకికి ఇస్తాడు రామా. ఆ వరలక్ష్మి అమ్మవారి దయవల్ల జ్ఞానాంబకి తమ మీద ఉన్న కోపం పోతుందని ఆశపడతారు జానకి రామా. అప్పుడే అక్కడికి వచ్చిన జ్ఞానాంబ.. ఇంట్లోని అందరినీ పిలిచి పనులు పురమాయిస్తుంది. అయితే జానకి రామాని మాత్రం పట్టించుకోదు. అలాగే.. మల్లికని పిలిచి కోడలు అంటే కోరి తెచ్చుకునే వరం. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. ఆమెకి చెప్పినట్లు పరోక్షంగా జానకికి హితబోధ చేస్తుంది జ్ఞానాంబ. అందుకే ఇంటి కోడలిగా అన్ని పూజ కార్యక్రమాలు నువ్వే చేయాలని మల్లికకి చెబుతుంది జ్ఞానాంబ. ఆమె చెప్పింది విని అందరూ షాక్ అవుతున్నారు.
అత్త మాట విని లోలోపల చాలా సంతోష పడుతుంది మల్లిక. కానీ.. ఏమి ఎరగనట్లు ప్రతి సంవత్సరం జానకి చేస్తుంది కదా అత్తని అడుగుతుంది మల్లిక అమాయకంగా ముఖం పెట్టి. దానికి.. ‘అమ్మ అంటే బిడ్డల మీద నమ్మకంతో గర్వంగా పొంగిపోవాలి.. అంతేకానీ.. గుడ్డిగా నమ్మించి మోసం చేయకూడదు’ అంటూ జానకి రామా వినేట్టుగా అంటుంది జ్ఞానాంబ. గతరాత్రి జ్ఞానాంబ అంతా కూల్ గా ఉండడానికి కారణం ఏంటో అప్పుడు అందరికీ అర్ధం అవుతుంది. జానకి, రామా పరిస్థితి ఏంటి.. వాళ్లేం చేయబోతున్నారో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..