Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ యువ నటి జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటోషూట్ చిత్రాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ అలర్ట్ గా ఉంటే ఈ చిన్నది పిక్స్ ను పోస్ట్ చేసి ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేసింది. గోధుమ రంగు చీర ధరించి ముక్కుకు భారీ బంగారు ముక్కెర పెట్టుటకుని తన హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో హీట్‌ను పెంచింది. ఈ పిక్స్‌లో అమ్మడి అందాలను చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక జాన్వీకపూర్ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా క్రేజీ కామెంట్ ను పోస్ట్ చేశాడు. అంతే కాదు జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కి ఆమె అనుచరుల నుంచి బోనీకపూర్ కుమార్తె అన్షులా కపూర్‌తో సహా అనేక మంది నుంచి లైకులు , కామెంట్ల వర్షం కురిసింది.

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే తారల్లో జాన్వీ కూడా ముందు వరుసలో ఉంటుంది. అమ్మడి చేసిన సినిమాలతో కన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హాట్ ఫోటో షూట్‌లతోనే ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంది. అందుకే ఈ బ్యూటీ తన అభిమానులను అప్పుడప్పుడు అవుట్‌స్టాండింగ్ అవుట్‌ఫిట్స్‌తో సర్‌ప్రైజ్ చేస్తూ ఉంటుంది. హాట్ ఫోటో షూట్‌లతో క్రేజ్‌ను సంపాదించుకుంటుంది. శుక్రవారం, జాన్వీ కపూర్ తన చిత్రాలను మట్టి దియా ఏమోజీలతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. జాన్వీ గోధుమరంగు చీర ధరించి, అదే రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబడి కెమెరాకు హాట్ పోజులను ఇచ్చింది. ఈ చీరకోసం ఎలాంటి ఆభరణాలు పెట్టుకోలేదు. కేవలం ముక్కుకు భారీ ముక్కు పుడక పెట్టుకుని అందరి దృష్టిని ఇట్టే ఆకర్షించింది.

జాన్వీ పోస్ట్ చేసిన ఈ పిక్స్ క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అనేక లైక్‌లు ,కామెంట్‌లతో ఇన్‌బాక్స్ నిండిపోయింది. ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా ఈ పిక్స్ కు రిప్లైగా హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. అన్షులా కపూర్, “BRO అని ఫైర్ ఎమోజీని పెట్టింది. కొంత మంది ఫాలోవర్స్ ఫోటోషూట్‌ను మెచ్చుకున్నారు.

ఈ మధ్యన బహిరంగ ప్రదర్శనల్లో , సోషల్ మీడియాలో జాన్వీ , ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ ఇద్దరూ తమ సంబంధాన్ని అంగీకరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. వారు గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు బాలీవుడ్ లో శిఖారు చేస్తున్నాయి. అయితే వారిద్దరూ దీనిని ఇంకా ధృవీకరించలేదు లేదా అలా అని ఖండించలేదు. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ఎంగేజ్మెంట్ బాష్‌లో జాన్వీ, శిఖర్ ఇద్దరూ కనిపించారు. ఇద్దరూ కలిసి మాల్దీవులకు విహారయాత్రకు కూడా వెళ్లారు.
