Janhvi Kapoor : పండుగల వేళ ముంబైలో జరిగే సందడి మామూలుగా ఉండదు. బాలీవుడ్ సెలబ్రిటీలు, స్టార్స్ ఓ రేంజ్లో హంగామా చేస్తుంటారు. దసర నవరాత్రులు మొదలు ఆ సందడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీపాళ పండుగకు ఇంకా సమయం ఉన్నా వారం ముందే తారలంతా హడావిడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫేవరేట్ ప్రమఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా బిగ్ గ్రాండ్ దీపావళి పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ ఇప్పుడు టాక్ ఆఫ్‌ది టౌన్‌గా నిలుస్తోంది.
![Janhvi Kapoor : ఈ అందాలు చూడాలంటే రెండుకళ్లు సరిపోవు janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-8.42.54-AM-1.jpeg)
Janhvi Kapoor : ఈ పార్టీకి గ్లామరస్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ వేసుకుని బాలీవుడ్ భామలు తమ అందాలతో రచ్చ రచ్చ చేశారు. పార్టీకి హాజరైన సెలబ్రిటీలు సున్నితమైన చీరల నుంచి హెవీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన లెహెంగా సెట్లను, షేర్వాణీలను ధరించి తమ దీపావళి వార్డ్ రోబ్ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేశారు. ఇక బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ క్వీన్ జాన్వీ కపూర్ ఈ అకేషన్ కోసం అదిరిపోయే లెహెంగాను ధరించి పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
![Janhvi Kapoor : ఈ అందాలు చూడాలంటే రెండుకళ్లు సరిపోవు janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-8.42.54-AM-4.jpeg)
దివాలీ పార్టీ కోసం జాన్వీ కపూర్ మనీష్ మల్హోత్రా తాజా కలెక్షన్స్ నుంచి అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుని అదరగొట్టింది. మెరిసేటి ఆకుపచ్చని రంగులో అద్భుతమైన ఎబ్రాయిడరీతో వచ్చిన లెహెంగాను వేసుకుని గ్లామరస్ లుక్స్‌తో యూత్‌ను ఫిదా చేసేసింది. ఈ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో జాన్వీ క్రేజీ ఫోటో షూట్ చేసి, ఆ పిక్స్‌ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది . ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పిక్స్ కింద ‘ ఐ థింక్ ఐ ఫౌండ్ మై న్యూ ఫేవరేట్ కలర్ ‘ అని క్యాప్షన్‌ను జోడించింది. ఈ గ్రీన్ కలర్ లెహెంగా ఫ్యాషణ్ ప్రియులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది.
![Janhvi Kapoor : ఈ అందాలు చూడాలంటే రెండుకళ్లు సరిపోవు 2 janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-8.42.54-AM-2.jpeg)
ఈ లెహెంగా సెట్లో జాన్వీ వేసుకున్న బ్లౌజ్ హైలెట్‌గా నిలిచింది. ట్రెండీ బ్లౌజ్‌తో పార్టీలో సందడి సందడి చేసింది జాన్వీ కపూర్. జెమ్స్, బీడ్స్, సీక్విన్స్ అలంకరణలతో స్ట్రాప్డ్ స్లీవ్స్, ప్లంగింగ్ నెక్లైన్, బ్యాక్ సైడ్ విస్తరించిన కటౌట్ డీటైల్స్ , ఫ్రంట్‌లో వచ్చిన క్రిస్ క్రాస్ వివరాలతో బ్లౌజ్ ఎంతో అట్రాక్టివ్‌గా కనిపించింది. ఈ బ్లౌజ్‌కు జతగా జాన్వీ కపూర్ హెవీ గ్రీన్ కలర్ జలకన్య ఆకారంలో డిజైన్ చేసిన లెహెంగాను వేసుకుని తన తొడ అందాలతో యూత్‌ను తన్మయంలో ముంచేసింది. హై రైస్ వెయిస్ట్‌లైన్, ఫిగర్ హగ్గింగి ఫిట్టింగ్స్, సీక్విన్స్ అలంకరణలతో ఎంతో అద్బుతంగా ఈ లెహెంగాను డిజైన్ చేశారు డిజైనర్. చివరగా తార్ వర్క్, సీక్విన్స్, గోటా పట్టీ ఎంబ్రాయిడరీతో వచ్చిన మ్యాచింగ్ జరీ దుపట్టాను వేసుకుని తన లుక్‌ను పూర్తి చేసింది.
![Janhvi Kapoor : ఈ అందాలు చూడాలంటే రెండుకళ్లు సరిపోవు 3 janhvi-kapoor-trending-glamours-looks-in-mermaid-lehenga-set-designed-by-manish-malhotra](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-8.42.54-AM-3.jpeg)
ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా జాన్వీ పెదాలకు గ్లాసీ మావీ లిప్ షేడ్ ను దిద్దుకుంది. కనులకు స్మోకీ ఐ ష్యాడో, స్లీక్ ఐలైనర్, మస్కరా వేసుకుని కనుబొమ్మలను డార్క్ చేసుకుంది. తన కురులతో మధ్యపాపిట తీసుకుని లూజ్‌గా వదిలి కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది. వేసుకుంది ట్రెడిషనల్ డ్రెస్సే అయినా తన లేలేత అందాలను చూపిస్తూ అందరి నజర్ తనపై పడేలా చేసుకుంటోంది ఈ అందాల చందమామ.