Krithi Shetty : కృతి శెట్టి.. ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా అమ్మడికి మంచి సక్సెస్‌ను కావల్సినంత పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో మంచి సక్సెస్‌నే అందుకుంది. ఇక ఇప్పుడే కాస్త ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉంది. లేదంటే కెరీర్ ఇబ్బందుల్లో పడిపోతుంది. అసలే మన తెలుగు ప్రేక్షకులు చూసిన మొహాల్నే పెద్దగా చూడటానికి ఇష్టపడరు. ఇక ఫ్లాప్ పడిందో.. కెరీర్ గోవిందా. కృతిశెట్టి కూడా కెరీర్లో కాస్త నిలదొక్కుకునే సమయంలో ‘ది వారియర్’ సినిమా చేసి గట్టి ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. ఇక అమ్మడి కెరీర్ ఎలా ఉండబోతోందనేది ప్రశ్నార్థకంగా మారింది.
Krithi Shetty : పోలీస్ ఆఫీసర్ ఆపరేషన్ చేస్తే..
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘ది వారియర్’. కోలీవుడ్ దర్శకుడు లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, నదియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ పోలీసాఫీసర్‌గా కనిపించాడు. నేరుగా పోలీసాఫీసర్ అయితే కథ మరోలా ఉండేది. కానీ ఎంబీబీఎస్ చదివి సమాజంలో చెడును ఎదుర్కోవడానికి పోలీస్ ఆఫీసర్‌గా మారడం ప్రేక్షకుడు జీర్ణించుకోలేని విషయం. మొత్తానికి పోలీస్ ఆఫీసర్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా సినిమా ఉందనే టాక్ నడుస్తోంది. కొత్త పాయింట్ అనుకున్నాడో ఏమో కానీ సరికొత్తగా దెబ్బ పడిపోయింది. మొత్తం మీద సినిమా ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది.
విజిల్ మహాలక్ష్మిగా కృతి అందంగా కనిపించింది. కానీ కృతి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కూడా లభించలేదనే టాక్ వినిపిస్తోంది. మరి ఇలాంటి సినిమాను అమ్మడు ఎలా అంగీకరించిందో అర్థం కాని పరిస్థితి. ఈ సినిమాతో తొలి ఫ్లాప్‌ను కృతి తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారిన కృతి వరుస ఆఫర్లతో ఇక్కడ ఫుల్ బిజీగా గడుపుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన ఈ చిన్నది తెలుగుతో పాటు తమిళ్లోనూ ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలోనే డేట్స్ అడ్జెస్ట్ అవక విశాల్ హీరోగా తెరెక్కనున్న ఓ సినిమాకు నో చెప్పినట్టు సమాచారం. కెరీర్ ఇంత పీక్‌లో కొనసాగుతున్న సమయంలో ఫ్లాపులు పడితే భవిష్యత్ గందరగోళంలో పడుతుందనే టాక్ వినిపిస్తోంది.