బరాస అంటే భారత “రైతు” సమితి అని మరోసారి రుజువు అయ్యింది అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు
రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు
‘జై కిసాన్’ అనేది మాకు కేవలం ఓ నినాదం మాత్రమే కాదు, మా ప్రభుత్వ విధానమని మరోసారి రుజువైంది. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా కేంద్రంలోని భాజాపా సర్కార్ అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించిన రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలానికి ఇది నిలవెత్తు నిదర్శనం. రైతు సంక్షేమంలో 9 ఏళ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యయనం. రైతులకు రక్షణ కవచంగా అమలు చేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగా చరిత్రపై చెరగని సంతకం. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం, కానీ ఒక తెలంగాణలోనే వ్యవసాయం అంటే ‘సంతోషం’ అని మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.
![మంత్రి కేటీఆర్: బరాస అంటే భారత "రైతు" సమితి 2 మంత్రి కేటీఆర్: బరాస అంటే భారత "రైతు" సమితి](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/twt.png)