Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను రోజూ అందిస్తూనే ఉంటుంది. క్యాజువల్ లుక్స్ నుంచి ఫెస్టివ్ కలెక్షన్స్ వరకు ప్రతి అవుట్ ఫిట్ లో ఎంతో కూల్ గా కనిపిస్తుంది ఈ చిన్నది. మృణాల్ ఫ్యాషన్ డైరీలు ఆమె అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీక్విన్డ్ గౌనులో తన ఒంపులను చూపిస్తూ ఫార్మల్ ప్యాంట్‌సూట్‌లో బాస్ లేడీగా కనిపిస్తూ అలరిస్తూనే ఉంటుంది మృణాల్. తాజాగా తన ఫ్యాషన్ గేమ్‌ను అప్‌గ్రేడ్ చేసి మెస్మ రైజ్ చేస్తోంది ఈ చిన్నది.

మృణాల్ తన అభిమానులకు ఏదో ఒక ప్రత్యేకమైనది అందించబోతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఇటీవలి ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని చిత్రాలను పంచుకుంది. తన ఎత్నిక్ అవుట్ ఫిట్ తో ఇన్‌స్టాగ్రామ్ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

పాస్టెల్ పింక్ రంగులో డిజైన్ చేసిన డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది మృణాల్ . ఫ్యాషన్ డిజైనర్ సీమా గుజ్రాల్‌కు మ్యూజ్‌గా వ్యవహరించింది ఈ బ్యూటీ. తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం డిజైనర్ యొక్క షెల్ఫ్‌ల నుండి ఎత్నిక్ డ్రెస్ ను ఎంచుకుంది. సిల్వర్ రేషమ్ థ్రెడ్స్ , సీక్విన్ వివరాలతో ఎంబ్రాయిడరీ చేసిన స్లీవ్‌లెస్ పాస్టెల్ పింక్ కుర్తా కు మ్యాచింగ్ గా ఆమె తెల్ల జరీ వర్క్‌ను కలిగి ఉన్న ఒక జత పాస్టెల్ పింక్ షరారా సెట్‌తో జత చేసింది.

ఈ సెట్ లో మృణాల్ ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించింది.బోర్డర్‌ల వద్ద తెల్లటి జరీ వివరాలతో వచ్చిన పాస్టెల్ పింక్ దుపట్టాలో, ఆమె తన రూపాన్ని కంప్లీట్ చేసింది. ఈ పిక్స్ కు సమ్ థింగ్ స్పెషల్ రాబోతోంది మీ దగ్గరికి అని క్యాప్షన్ ను జోడించింది.

కుశాల్ ఫ్యాషన్ జ్యువెలరీ షెల్ఫ్‌ల నుండి గోల్డెన్ నెక్ చోకర్ ను ఎన్నుకుని తన మెడలో అలంకరించుకుంది. చెవులకు గోల్డెన్ జంకాలను పెట్టుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ ఆర్చా మెహతా లుక్స్ ను హైలెట్ చేసింది. మేకప్ ఆర్టిస్ట్ లోచన్ సహాయంతో, మృణాల్ న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మస్కరాపెట్టుకుంది. పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుంది.
