Naga Chaitanya : నాగచైతన్యపై ఇటీవలి కాలంలో రూమర్స్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సమంతతో విడాకుల అనంతరం ఎన్నో రూమర్స్. వాటన్నింటినీ మౌనంగానే భరిస్తున్నాడు చై. ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైపోయాడు. తను హిందీలో నటించిన మూవీ ‘లాల్ సింగ్ చద్దా’. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య బాలరాజున అనే ఆర్మీ యువకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో చై చాలా బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా ఆగస్ట్ 11న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక హిందీలో చైకి తొలి చిత్రం కావడంతో బాలీవుడ్ మీడియాకు వరుస పెట్టి ఇంటర్య్వూ ఇస్తున్నాడు. ఈ క్రమంలో చైకి తన వ్యక్తిగత జీవితం, సమంత విడాకులు, అతనిపై వస్తున్న రూమర్స్ వంటి విషయాలపై ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటికి చై తనదైన స్టైల్లో సమాధానం ఇస్తున్నాడు. ఇలాంటి ప్రశ్నలకు చై కూడా అంతే ఆసక్తికరంగా సమాధానం చెబుతున్నాడు. మొత్తానికి చై ఇంటర్వ్యూలు చాలా ఆసక్తికరంగా మారాయి.
Naga Chaitanya : ప్రేమ అనేది మనిషి జీవితంలో కీలకం
తాజాగా ముంబై మీడియాతో ముచ్చటించిన చైకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు మళ్లీ ప్రేమలో పడే అవకాశం ఉందా? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనిపై చై స్పందిస్తూ.. ఏమో! ఎవరికి తెలుసు. ఏదైనా జరగొచ్చంటూ సమాధానం ఇచ్చాడు. అనంతరం ‘ప్రేమ అనేది మనిషి జీవితంలో కీలకం. ప్రేమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం జీవించేందుకు గాలి ఎంత అవసరమో.. ప్రేమ కూడా అంతే అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేమించాలి.. ప్రేమించబడాలి. అప్పుడే మన జీవితం ఆనందంగా.. సాఫీగా సాగుతుంది. ఇటీవల నటి శోభితా దూళిపాళతో చై ప్రేమలో పడ్డాడంటూ ఇటీవల పుకార్లు వచ్చిన నేపథ్యంలో తాజాగా ప్రేమపై చై చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. నెట్టింట దీనిపై పెద్ద చర్చే కొనసాగుతోంది.