Sam-Chai : అక్కినేని హీరో నాగచైతన్య, సమంతల ప్రేమ వివాహంతో అందరూ వారిపై చాలా అభిమానం కురిపించారు. ఇద్దరూ ఒక మంచి క్యూట్ కపుల్ అని.. టాలీవుడ్లోనే ఇంతటి అన్యోన్య జంటూ లేదంటూ ప్రశంసలు కురిపించారు. ఆ తరువాత ఒక్కసారిగా విడాకుల విషయం వైరల్ కావడంతో అది నిజమా? కాదా? తెలియక చాలా మంది అయోమయంలో ఉండిపోయారు. కానీ ఈ జంట కూడా విడాకులు ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. అప్పటి నుంచి అందరినీ ఎన్నో ప్రశ్నలు తొలుస్తున్నాయి. వీరిలో ఏ ఒక్కరూ సోషల్ మీడియాలో కనిపించినా కూడా.. విడాకులకు సంబంధించిన ప్రశ్నలతో విసిగిస్తున్నారు. వారికంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందని మరచి మరీ రకరకాల ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు. దీనిపై తాజాగా చై మండిపడ్డాడు.
Sam-Chai : సమంతతో విడాకులపై ఇంత రచ్చ ఎందుకు?
ఎప్పుడూ కూడా తన విడాకుల విషయంపై కానీ.. వస్తున్న రూమర్స్‌పై కానీ చై స్పందించింది లేదు. కానీ తొలిసారిగా మాత్రం కాస్త ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ప్రమోషన్స్‌తో చై బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో చై బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ సందర్భంగా నాగచైతన్య ఇటీవల ఓ ఇంగ్లీష్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో కూడా చైకి విడాకులపై ప్రశ్న ఎదురైంది. దీంతో స్పందించక తప్పలేదు. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందని.. సమంతతో విడాకులపై ఇంత రచ్చ ఎందుకన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. పైగా కారణాన్ని ప్రపంచానికి వివరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
‘నా వ్యక్తిగత జీవితం గురించి అందరు మాట్లాడుకోవడం అసహనం కలిగిస్తోంది. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. సమంతతో విడాకులపై ఇప్పటికే ప్రకటన చేశాం. అయితే దానికి కారణమేంటో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు జీవిస్తున్నాం. సమంత దారి సమంతదే.. నా దారి నాదే. ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు’ అంటూ ఘాటూగా స్పందించాడు. ఇంకా చై మాట్లాడుతూ.. తనపై వస్తున్న రూమర్స్‌ని తానేప్పుడు పట్టించుకోనని, మొదట్లో ఆలోచించేవాడినని, కానీ ఇప్పుడు ఆ రూమర్స్ గురించి అంతగా ఆలోచించడం లేదని చై అన్నాడు. భవిష్యత్‌లో సామ్‌తో నటించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు మాత్రం చాలా కూల్‌గా నవ్వేసి సమాధానం ఇచ్చాడు. ఒకవేళ అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో.. కానీ అది జరుగుతుందో లేదో నాకు తెలియదు’ అని చై తెలిపాడు.