Patas Praveen : ఏదైనా ఒక సక్సెస్ వెనుక ఎంత కష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మామూలు విషయం కాదు. అది వెండితెర అయినా.. బుల్లితెర అయినా.. బ్యాక్ గ్రౌండ్ బాగా గట్టిగా ఉంటే పెద్దగా చెప్పుకోనవసరం లేదు కానీ లేకపోతే మాత్రం ఇక వారి కష్టం మాటల్లో చెప్పలేం. ఇక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ల చిరునవ్వు వెనక కొండం విషాదం ఉంటుంది. కానీ అవేమీ పైకి కనిపించనివ్వరు. బాధలను, దుఃఖాలను గొంతులోనే దిగమింగుకుని మోముపై బలవంతపు నవ్వును పులుముకొంటారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు. ఇటీవలి కాలంలో టిక్‌టాక్ పుణ్యమాని చాలా మంది టాలెంట్ వెలుగులోకి వచ్చింది.
ఈ టిక్‌టాక్ చేసి ఎంతో మంది స్టార్స్ అయిపోయారు. బుల్లితెరపై కామెడీ షోస్‌ను నడిపే డైరెక్టర్లు తమ షోలోకి తీసుకుని వారికి మంచి లైఫ్ ఇచ్చారు. పటాస్ అయితేనేమీ,జబర్దస్త్ అయితేనేమీ ఎందరికో లైఫ్ ఇచ్చాయి. అలా పైకి వచ్చిన వారిలో ఒకడు పటాస్ ప్రవీణ్. కడుపులోనే కష్టాన్ని దాచుకుని కడుపుబ్బా నవ్విస్తారు. ముళ్లదారిలో నడిచిన కమెడియన్ల జాబితాలో పటాస్ ప్రవీణ్ ఒకరు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ సహా పలు కామెడీ షోలలో కమెడియన్‌గా రాణిస్తున్నాడు. కాగా.. నేడు అతడి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా ప్రవీణ్ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు.
Patas Praveen : చిన్న వయసులోనే తల్లి మృతి..
గత కొంతకాలంగా ప్రవీణ్ తండ్రి బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. ఆయనను ఇటీవల ఆస్పత్రిలో చేర్పించగా వెన్నుపూసలో నీరు వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఆ నీరు తీయడానికి ప్రయత్నించే క్రమంలో అతడి కాళ్లుచేతులు పడిపోయాయి. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది.ఈ క్రమంలోనే ఆయన నేడు మృతి చెందారు. తండ్రి మృతితో ప్రవీణ్ తీవ్రంగా కృంగిపోయినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ తల్లి కూడా అతని చిన్న వయసులోనే మరణించింది. తండ్రి రెండో పెళ్లి చేసుకోకుండా తన రెక్కల కష్టంతో కొడుకులిద్దర్నీ చదివించారు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలు. అన్నిటినీ భరించి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రవీణ్ ఒక సథాయికి వచ్చాడు. ప్రవీణ్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని తోటి కమెడియన్లు, అతని అభిమానులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.