Bigboss Beauty : బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ను పరిచయం చేయాల్సిన పని ఉండదు. అది హిందీ అయినా.. తెలుగు అయినా.. బిగ్‌బాస్ అంటేనే తెగ ఫేమస్ అయిపోతారు. తాజాగా హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో మెరిసిన బ్యూటీ ఉర్ఫీ జావేద్. అమ్మడి గురించి సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం చేయాల్సిన పని లేదు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో సందడి చేసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్‌తో రచ్చ రచ్చ చేస్తోంది. అమ్మడి డ్రెస్సింగ్ స్టైల్ విభిన్నంగా ఉంటుంది. అమ్మడి దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయవచ్చా అని నోల్లు వెళ్ల బెడుతున్నారు నెటిజన్లు.
చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, బికినీలతో అందాలను ప్రదర్శిస్తున్న అమ్మడిపై ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. అయితే తాజాగా ఉర్ఫీ జావేద్ మరో సమస్యను ఎదుర్కొంటోంది. అమ్మడిని ఒక అబ్బాయి లైంగికంగా వేధిస్తున్నాడట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఓ వ్యక్తి తనను రెండేళ్లుగా వేధిస్తున్నాడని.. తన ఫోటోను మార్ఫింగ్ చేసి తనతో శృంగారపు వీడియో చాట్ చేయమని బలవంతం చేస్తున్నాడని తెలిపింది. చాటింగ్‌కు ఒప్పుకోకపోతే ఆ ఫొటోను అనేక బాలీవుడ్ పేజీలలో పోస్ట్ చేసి, తన కెరీర్‌ను నాశనం చేస్తానని రెండేళ్లుగా నరకం చూపిస్తున్నాడని చెప్పుకొచ్చింది.
Bigboss Beauty : ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావట్లేదు..
కనీసం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేసింది. తాను 1 తేదిన గోరేగావ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపింది. 14 రోజులు గడిచినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను తీవ్ర నిరాశకు గురయ్యానని వెల్లడించింది. ముంబయి పోలీస్ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. కానీ, ఈ వ్యక్తి పట్ల వారు ఇలా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదని తెలిపింది. అతను ఎంతో మంది మహిళలతో ఇలా చేశాడని తెలిసినా, ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలే ఉర్ఫీ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఉర్ఫీకి చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లను సైతం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.