Pooja Hegde : టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే వర్క్ విషయంలో నో కాంప్రమైజ్ అంటోంది. కాలు నొప్పితో బాధపడుతున్నా రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తూ యువ హీరోయిన్లకు ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది. కట్టుతో ఉన్న కాలి పిక్ ని నిన్ననే షేర్ చేసి తన పరిస్థితిని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది పూజా హెగ్దే.ఫ్యాన్స్ అమ్మడి పరిస్థితిని చూసి బాధపడ్డారు
ఇప్పుడేమో అదిరిపోయే గౌను వేసుకుని హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
Pooja Hegde : ఓ వైపు సినిమాలు మరో వైపు హాట్ ఫోటో షూట్లతో బిజీ బిజీగా ఉంటోంది ముద్దుగుమ్మ పూజా హెగ్దే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్‌ను సంపాదించుకున్న ఈ పొడవుకాళ్ల సుందరి ఇప్పుడు బాలీవుడ్లో తన కిస్మత్‌ను పరీక్షించుకుంటోంది. హిందీ లోనూ అమ్మడికి మంచి అవకాశాలే అందివస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్‌తో కలిసి ఓ ప్రాజెక్టులో నటించబోతోంది ఈ చిన్నది. ఈ గ్యాప్‌లోనే ఓ అద్భుతమైన ఫోటో షూట్ చేసి కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. గోల్డెన్ కలర్ గౌను వేసుకుని యూత్ మనసు దోచేస్తోంది.
గోల్డెన్ కలర్ గౌన్‌లో తన ఫిగర్‌ను పర్ఫెక్ట్ గా చూపిస్తోంది పూజా. టైట్ఫిట్టింగ్తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌లో సెక్సీ లుక్స్‌తో ఇంప్రెస్ చేస్తోంది. మెడలో గొల్డెన్ కలర్ నెక్లెస్ చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని క్రేజీ లుక్స్‌తో కవ్వించింది ఈ చిన్నది. సింపుల్ మేకప్ లుక్స్‌తో మంత్రముగ్ధులను చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అవుట్‌ఫిట్‌తో చేసిన పిక్స్‌ను షేర్ చేసిన పూజాకు ఫాలోవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమ్మడి అందాలను పొగడ్తలతో ముంచేస్తున్నారు ఫ్యాన్స్.
అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌తో అందరిని ఎలా తనవైపు తిప్పుకోవాలో ఈ బ్యూటీకి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. రెడ్ కార్పెట్ లుక్స్ అయినా క్యాజువల్ వేర్ అయినా పార్టీ ఫ్యాషన్ అయినా పూజా తనదైన స్టైల్స్‌ను ప్రజెంట్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తుంటుంది. రీసెంట్గా ఓ అవుట్ స్టాండింగ్ ట్రాన్స్పరెంట్ మిర్రర్ బాడీకాన్ గౌన్ వేసుకుని మెరిసిపోయింది ఈ చిన్నది. ఈ అవుట్‌ఫిట్ పిక్స్ కూడా ఇంటర్నెట్ను షేక్ చేశాయి.
బాడీకాన్ డ్రెస్సుల్లోనే కాదు బీచ్ లుక్స్‌తోనూ అమ్మడు కుర్రాళ్ల మతులుపోగొట్టగలదు. బీచ్ రిసార్ట్ లో బికినీ వేసుకుని ఆ మధ్య పూజా బోల్డ్ ఫోటో షూట్ చేసి ఇంటర్నెట్లో రచ్చ రచ్చ చేసింది. టూ పీస్ బికినీలో తన సెక్సీ అందాలను స్పష్టంగా చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది.