Priyanka Chopra : ప్రియాంక చోప్రా ఎట్టకేలకు తన కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్ పేస్ ను రివీల్ చేసింది. ప్రియాంక భర్త నిక్ జోనాస్‌తో సహా జోనాస్ బ్రదర్స్ ఆవిష్కరించిన ఒక కార్యక్రమానికి ప్రియాంక హాజరయ్యింది. ఈ కార్యక్రమంలో ప్రియాంక ముందు వరుసలో కూర్చుని మాల్టీ చేతుల్లో ఎత్తుకుంది. తన కూతురినికి క్రీమ్ కలర్ దుస్తులు , తలకు సరిపోయే హెయిర్‌బ్యాండ్ పెట్టి అందంగా ముస్తాబు చేసి తొలిసారి బేబీ ముఖాన్ని అభిమానులకు చూపించింది. ప్రియాంక కూతురిని చుసిన అభిమానులు బేబీకి అన్ని నాన్న పోలికలే అని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రియాంక కూతురి పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఈవెంట్ వీడియో తో పాటు కూతురి పిక్స్ ను పోస్ట్ చేసింది ప్రియాంక. ఈ వీడియోలో లో మాల్టీ ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను ,వీడియోను పంచుకుంటూ, ప్రియాంక ఇలా వ్రాసింది, “నా ప్రేమను చూసి చాలా గర్వపడుతున్నాను! అభినందనలు @jonasbrothers.” ముగ్గురు జోనాస్ బ్రదర్స్ వేదికపై తమ వాక్ ఆఫ్ ఫేమ్ సర్టిఫికేట్లతో నిలబడి ఉండగా, ప్రియాంక , మాల్టీ ప్రేక్షకుల మధ్య నుండి వారిని చూస్తున్నట్లు చిత్రం చూపిస్తుంది.

వీడియోలో ప్రియాంక మాల్టీతో ఆడుకుంటున్నట్లు కనిపిస్తుంది. నిక్ జోనాస్ మాట్లాడుతున్న క్రమంలో బేబీ అరుపు లకు నిక్ ఆనందంలో మునిగిపోయాడు. తొలిసారిగా మాల్టీ ముఖాన్ని చూసిన ప్రియాంక, నిక్ అభిమానులు ఉప్పొంగిపోయారు. ఈ పోస్ట్‌కి ప్రతిస్పందనగా ఒక అభిమాని బేబీ మాల్టీ కి దిష్టి తీయండి అని రాసింది. మరొకరు“మీ కుమార్తె చాలా అందంగా ఉంది! ఆమె అక్కడ ఉండటం చాలా అద్భుతంగా ఉంది!” మాల్టీ అచ్చం తన నాన్న లాగే ఉంది అని కామెంట్ పోస్ట్ చేసాడు.

ప్రియాంక , నిక్ మాల్టీ ని సరోగసీ ద్వారా ఈ లోకానికి స్వాగతించారు. ప్రస్తుతం నిక్ , ప్రియాంక మాల్టీలు ముగ్గురు లాస్ ఏంజిల్స్ లో ఓ ఖరీదైన ఇంటిలో నివసిస్తున్నారు. తన కూతురు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ప్రియాంక ఎక్కడ ఆమె కూతురి పిక్ ను రివీల్ చేయలేదు . సోషల్ మీడియా లో పిక్స్ పోస్ట్ చేసిన మాల్టీ ముఖాన్ని హార్ట్ ఎమోజీతో దాచుతూవస్తోది.
