Purna : హీరోయిన్ పూర్ణ పెళ్లి గురించి ఇటీవలి కాలంలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా పూర్ణ తన పెళ్లి ప్రకటన చేసింది. వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని కాబోయే భర్తగా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెకు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఆ తరువాత కొన్ని రోజులకు ఈ ముద్దుగుమ్మ ఘనంగా ఎంగేజ్మెంట్ వేడుక కూడా జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలో, వీడియోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతా మరోసారి విషెస్ చెప్పారు. అంతా బాగుంది అనుకునే లోపే ఓ రూమర్ హల్చల్ చేయడం ఆరంభించింది.
పూర్ణ సడన్‌గా పూర్ణ తన పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారనే పుకార్లు తెరపైకి వచ్చాయి. ఇక సోషల్ మీడియా ఉంది.. నెటిజన్లు ఉన్నారు.. ఇక ఆగుతారా? తమకు తోచిన కారణాలన్నీ వెదికి వెదికి వెలికి తీసి రచ్చ రచ్చ చేశారు. రకరకాల రూమర్స్. మరో రెండు మూడు నెలల్లో వివాహం జరగాల్సి ఉండగా పూర్ణ తన నిర్ణయం మార్చుకున్నారని, షానిద్ అసిఫ్ అలీతో వివాహం రద్దు చేసుకున్నారంటూ రకరకాల కథనాలను ఇటు మీడియా.. అంటూ సోషల్ మీడియా అందించింది. కెరీర్ కోసమే పూర్ణ ఈ నిర్ణయం తీసుకున్నదనే వాదన కూడా తెరపైకి వచ్చింది.
Purna : ఎప్పటికీ నావాడు..
ఈ పుకార్లు.. చర్చలు.. కథనాలు చూసి విసుగెత్తిందో ఏమో కానీ ఒకే ఒక్క ఫోటోతో వీటన్నింటికీ పూర్ణ చెక్ పెట్టేసింది. కాబోయే భర్తతో సన్నిహితంగా కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ ‘ఎప్పటికీ నావాడు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పూర్ణ పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయ్యింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ ఫొటోలో ఆమె షానిద్ని గట్టిగా హగ్ చేసుకుంది. అలాగే నీతో జీవితాంతం అంటూ ఓ రొమాంటిక్ కామెంట్ కూడా పెట్టింది. అలా పెళ్లి క్యాన్సిల్ రూమర్స్‌ని హీరోయిన్ పూర్ణ ఖండించింది. మొత్తానికి పూర్ణ కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.