Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ అంటే వర్కవుట్ ఫ్రీక్ అని ఇండస్ట్రీ లో ఎవరైనా చెప్పేస్తారు. ఈ బ్యూటీ తన తండ్రి నుండి ఆరోగ్యకరమైన వ్యసనాన్ని వారసత్వంగా పొందింది. ఈ బ్యూటీ ఒక్క రోజు కూడా జిమ్‌కు వెళ్లకుండా ఉండలేదు. ఎక్కువ సమయం వ్యాయామాలతోనే గడిపేస్తుంటుంది. అందుకే రకుల్ ను ఇండస్ట్రీ లో వర్కవుట్ ఫ్రీక్ అని పిలుస్తుంటారు.

ఈ నటి వర్కౌటే తనకు ఆహారం లాంటిదని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి . ఒక రోజు వ్యాయామం చేయకపోతే, ఆరోజంతా ఎదో పోగొట్టుకున్నట్లే ఉంటుందట.

అయితే ఈ మధ్యకలంలో రకుల్ వర్కౌట్ లతో పాటు ఫోటో షూట్ లను చేస్తూ ఫ్యాషన్ దివా గా మారిపోతోంది. తన ఫిగేర్ కు తగ్గ ఫాషన్ దుస్తులను ఎన్నుకుంటూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా అనేక అవుట్ ఫిట్స్ తో చేసిన హాట్ పిక్స్ ను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ పొట్టి గౌను వేసుకుని చేసిన బోల్డ్ ఫోటో షూట్ పిక్స్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్నాయి. అమ్మడి బోల్డ్ అందాలని చూసి కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు.

రకుల్ ప్రీత్ ఈ డ్రెస్ ను డిజైనర్ హసన్ హెజాజీ ఫ్యాషన్ లేబుల్ నుండి సేకరించింది. దీని ధర అక్షరాలా రూ. 27 వేలు. డీప్ స్వీట్ హార్ట్ నెక్ లైన్, థిన్ స్ట్రాప్స్ , స్లీవ్ లెస్ డీటెయిల్స్ తో మోకాళ్ళపైకి ఉన్న సీక్విన్ బ్లాక్ డ్రెస్ వేసుకుని అదరగొట్టింది రకుల్.

స్ట్రాప్‌లెస్ బ్లాక్ షిమ్మరీ డ్రెస్‌లో పార్టీ లుక్ లో కనిపించి ఫ్యాషన్ ప్రియులను మరింతగా ఆకర్షించింది. ఈ పొట్టి డ్రెస్ లో తన పిక్కల అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది రకుల్ . ఈ అవుట్ ఫిట్ కు జోడీగా బ్లాక్ కలర్ హీల్స్ జత చేసి వయ్యారాలు పోయింది బ్యూటీ . తన్ లుక్ ను మరింత అట్రాక్టీవ్ గా మార్చుకునేందుకు చెవులకు హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది రకుల్.
