Rakul Preet Singh : వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో కెరీర్ ప్రారంభంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని వరుసపెట్టి హిట్ లు కొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్ . లౌక్యం , పండగ చేసుకో , కిక్ 2 , బ్రుస్ లీ , సరైనోడు, నాన్నకు ప్రేమతో , విన్నెర్ వంటి తెలుగు సినిమాల్లో యువ హీరోలతో జోడి కట్టి తన నటనతో ఇంప్రెస్ చేసినిది ఈ బ్యూటీ. ఆలా పదేళ్లు సాగిన బ్యూటీ హిట్ ట్రాక్ మన్మధుడు 2 ప్లాప్ తో వరుసపెట్టి ప్లాప్ లు తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత చెక్, కొండపోలం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటంతో మెళ్లిగా టాలీవుడ్ కు రామ్ రామ్ చెప్పేసి బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం ముంబైలో ఉన్న బ్యూటీ రెండు సినిమాలు నాలుగు ఫోటో షూట్ లతో తన కెరీర్ లో ముందుకు వెళ్తోంది. తాజా ఓ ఈవెంట్ కోసం అదిరిపోయే డ్రెస్ వేసుకుని అందరిని మంత్రముగ్ధులను చేసింది.

రకుల్ ప్రీత్ అకేషన్ కు తగ్గట్లుగా అందమైన అవుట్ ఫిట్‌లతో అభిమానుల చూపులను తన వైపుకు తిప్పుకుంటుంది. తన నటనతోనే కాకుండా ఆమె సార్టోరియల్ ఫ్యాషన్ ఎంపికల తో కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆరంజ్ బాడీ కాన్ డ్రెస్ తో హాట్ ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. రకుల్ ప్రీత్ ఆరెంజ్ ఎమోజీలను జోడించి ఈ పిక్స్ ను పోస్ట్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ బాడీకాన్ డ్రెస్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్ . ఈ బ్యూటీ ఫిగర్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. డీప్ నెక్ లైన్ , స్లీవ్ లెస్ టైట్ ఫిట్ డ్రెస్ లో రకుల్ తన వయ్యారాలు చూపిస్తూ నెట్టింట్లో మంటలు రేపింది. తన రూపానికి మరింత సొగసులను అద్ధేందుకు చెవులకు హూప్ ఇయర్ రింగ్స్ ను జోడించింది.

రకుల్ ప్రీత్ ఈ అవుట్ ఫిట్ ను అలెక్స్ పెర్రీ అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ కలెక్షన్స్ నుంచి ఎన్నుకుంది. రెడ్ కార్పెట్ లుక్ కు సరిపోయే ఈ అవుట్ ఫిట్ కు జతగా పాదాలకు న్యూడ్ పాయింటెడ్ హీల్స్ వేసుకుంది. రకుల్ తన హెయిర్ ను లూస్ గా వదులుకుని సింపుల్ మేకప్‌ను తో గ్లామరస్ లుక్స్ తో అదరగొట్టింది.
