Rolls Royce : రోల్స్ రాయిస్ కారును మనలో చాలా మంది చూసి ఉండం కూడా. ఆ కార్లు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే వాటిని కొనాలంటే ఓ రేంజ్ ఉండాలి. లగ్జరీ కార్లలో టాప్‌లో ఉంటుంది ఈ కారు. రోల్స్ రాయిస్ కారు ఉందంటే ఆ వ్యక్తి తప్పకుండా బిలియనీర్ అయి ఉంటాడు. అసలు ఆ కారులో ఉండే లగ్జరీ, సౌకర్యాలు అదుర్స్ అంతే. రోల్స్ రాయిస్ కారును కలిడి ఉండటమనేది స్టేటస్ సింబల్‌గా కూడా భావించేవారు లేకపోలేదు.
చాలా ఖరీదైన కారు కాబట్టి అతి కొద్ది మంది దగ్గరే ఈ కారు ఉంటుంది. మరి దీని ధర ఎంత ఉండొచ్చనేది ఎప్పుడైనా ఆలోచించామా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అంత అర్హత కూడా మనకు లేదనిపిస్తుంది. అయితే దేశీయ మార్కెట్లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ధర రూ. 5.25 కోట్లు. ఇక ఇవి మన దేశంలో అయితే దొరకడమే చాలా తక్కువ.
ఈ కారు ఒకటి కలిగి ఉంటేనే అవాక్కవుతాం. ఒక్కసారైనా ఆ కారును చూద్దాం అనిపిస్తుంది. కానీ ఓ కుటుంబం రోల్స్ రాయిస్ కార్లను మూడింటిని కలిగింది.
ఈ కుటుంబం ఏ అమెరికాలోనో ఉందనుకునేరు. మన దేశంలోనే.. కేరళలో ఉంది. ఈ మూడు రోల్స్ రాయిస్ కార్లు కల్యాణ్ జ్యువెలర్స్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణారామన్తో పాటు వారి కుమారులు రమేష్, రాజేష్ వద్ద ఉన్నాయి. ఈ ముగ్గురూ ఎటు వెళ్లాలన్నా తమ రోల్స్ రాయిస్ కార్లనే వినియోగిస్తారట. కల్యాణ్ రామన్‌తో పాటు ఆయన ఇద్దరూ కుమారులు.. రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ 2 ను వినియోగిస్తున్నారు. అయితే వీరి ముగ్గురు కార్ల కలర్స్ మాత్రం వేరుగా ఉంటాయి. ఒకటి బ్లాక్, మరొకటి సిల్వర్, ఇంకొకటి వైట్. ఇక అంబానీ కుటుంబమైతే ఏకంగా 8 రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉంది.