Saara Ali Khan : బాలీవుడ్ స్టార్స్ తమ ఫ్యాషనబుల్ లుక్స్‌తో ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన దివాలీ పార్టీలో సందడి చేశారు. బాలీవుడ్ సీనియర్ సెలబ్రిటీ కపుల్స్ తో పాటు యువ హీరోలు , హీరోయిన్లు ఈ దివాలీ పార్టీలో అమేజింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు. ఈ పార్టీకి హాజరైన యువ కథానాయిక సారా అలీఖాన్ కూడా అదిరిపోయే అవుట్‌ఫిట్ వేసుకుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
![Saara Ali Khan : ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.37.16-AM-3.jpeg)
Saara Ali Khan :బంగారపు వర్ణంలో భారీ డిజైన్స్‌తో రూపొందించిన లెహెంగా సెట్‌ను వేసుకుని ఎత్నిక్ లుక్స్‌తో యూత్‌ను ఆకర్షించింది. పార్టీలో తన అవుట్‌ఫిట్‌కి సంబంధించిన పిక్స్‌ను సారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ కింద ‘ దివాలీ నైట్స్ ఎంజాయ్ మిఠాయ్ అండ్ స్వీట్ బైట్స్ ‘ అని క్యాప్షన్‌ను జోడించింది.
![Saara Ali Khan : ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.37.16-AM-1.jpeg)
ఈ గోల్డెన్ లెహెంగా సెట్లో సారా అలీ ఖాన్ ఎంతో క్యూట్‌గా కనిపించింది. డీప్ ప్లంగింగ్ నెక్లైన్, హాఫ్ స్లీవ్స్‌తో, సీక్విన్స్ డీటైల్స్‌తో హెవీ ఎంబ్రాయిడరీతో వచ్చిన బ్లౌజ్‌ను వేసుకుని దానికి మ్యాచింగ్‌గా భారీ ఫ్రిల్స్తో , సీక్విన్ డీటైల్స్, ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన స్కర్ట్‌ను వేసుకుంది. ఈ రెండింటికి మ్యాచింగ్‌గా గోల్డెన్ బార్డర్స్ కలిగిన నెట్టెడ్ దుపట్టాను వేసుకుని తన ఎత్నిక్ లుక్స్‌తో పిచ్చెక్కించింది సారా అలీ ఖాన్. డీప్ బ్లౌజ్లో తన ఇన్నర్ పార్ట్స్ హైలెట్ అయ్యేలా హాట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ చిన్నది.
![Saara Ali Khan : ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.37.16-AM.jpeg)
ఈ హెవీ లెహెంగా సెట్‌కు మ్యాచ్ అయ్యేలా చేతికి గోల్డెన్ బ్యాంగిల్స్‌ను వేసుకుంది సారా అలీ ఖాన్. మెడలో వజ్రాలతో డిజైన్ చేసిన బంగారపు చోకర్ నెక్లెస్‌ను , చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మంత్రముగ్ధులను చేస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
![Saara Ali Khan : ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.37.16-AM-4.jpeg)
సారా అలీ ఖాన్ 2018లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కేదార్నాథ్ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో జోడీ కట్టి అద్భుతమైన నటనతో అందరిని ఇంప్రెస్ చేసింది. ఆ తరువాత సింబాలో రణ్వీర్ సింగ్‌తో రొమాన్స్ చేసింది. కార్తిక్ ఆర్యన్‌తో లవ్ ఆజ్ కల్ సినిమాలో నటించింది. వరుణ్ దావన్తో కూలీ నెం 1 సినిమా, ఆ తరువాత సౌత్ స్టార్ ధనుష్‌తో అత్రంగీరే సినిమాలో నటించి తన నటనతో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది.
![Saara Ali Khan : ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.37.16-AM-5.jpeg)
సినిమాల్లో నటనతోనే కాదు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది సారా. ఈ భామ ఏ పిక్ పోస్ట్ చేసినా ఫాలోవర్స్ లైకులు, షేర్ల వర్షంతో ఇన్‌బాక్స్‌ను నింపేస్తారు. తాజాగా పోస్ట్ చేసిన ఈ లెహెంగా పిక్స్ కూడా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
![Saara Ali Khan : ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు 2 saara-ali-khan-pretty-ethnic-looks-in-manish-malhotra-diwali-bash](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.37.16-AM-2.jpeg)