Uday Kiran : టాలీవుడ్లో ఇలా వచ్చి అలా స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు. కనీసం బ్యాక్‌గ్రౌండ్ కూడా లేదు. అలాగని ఏదైనా ట్రైనింగ్ సెంటర్ నుంచి నటనలో చికిత్స తీసుకున్నదీ లేదు. ఏదో కొన్ని వేల మందిలో ఒకడిగా వెళ్లి అలా సెలక్ట్ అయిపోయి.. కేవలం కొన్నంటే కొన్ని చిత్రాలతోనే స్టార్ హీరోగా ఎదిగాడు. లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన ఉదయ్కిరణ్కి యూత్‌లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో కెరీర్ లేకపోవడం, సరైన అవకాశాలు లేక డిప్రెషన్‌తో ఉదయ్‌కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
మొత్తానికి ఎంత త్వరగా టాలీవుడ్లోకి క్లిక్ అయ్యాడో అంతే త్వరగా అంతర్ధానమయ్యాడు. ఉదయ్ కిరణ్ మృతి కూడా ఒకరకంగా మిస్టరీగానే ఉంది. అసలెందుకు ఆత్మహత్య వరకూ వెళ్లాడని పూర్తి విషయం ఎవరికీ తెలియదు. కేవలం కెరీర్ పరంగా సరైన అవకాశాలు లేకపోవడం వల్లేననేది కేవలం ఊహాగానాలు మాత్రమేనని తెలుస్తోంది. తాజాగా ఉదయ్‌కిరణ్ మృతిపై హీరోయిన్ సదా స్పందించింది. ఉదయ్ కిరణ్ అలాంటి నిర్ణయం తీసుకుంటాడని తాను ఎప్పుడూ ఊహించలేదని పేర్కొంది. ఏం జరిగినా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదని చెప్పుకొచ్చింది. అన్నింటికంటే జీవితమే ముఖ్యమని.. సమస్యకు చావు పరిష్కారం కాదని సదా చెప్పుకొచ్చింది.
Uday Kiran : ఏం జరిగినా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు..
‘ఉదయ్ కిరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎప్పుడూ ఊహించలేదు. ఉదయ్ కిరణ్‌తో కలిసి ‘ఔనన్నా కాదన్నా’ సినిమా చేశాను. అతను ఎంతో మంచి వ్యక్తి. అంత మంచి నటుడ్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన కెరీర్లో ఎక్కడో తప్పు జరిగింది. కానీ ఏం జరిగినా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సినిమా అవకాశాల కంటే జీవితమే ముఖ్యం. సమస్యకు చావే పరిష్కారం కాదు.. ఒక యాక్టర్ గా మనం ది బెస్ట్ అవ్వాలి అంతే. ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది ‘ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.