Salaar Villain : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కెజిఎఫ్ ఫేమ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న అండర్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సలార్ మూవీలో విలన్‌గా నటిస్తున్న భాస్కరరావు దుబ్బాక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆర్టీవీ ఛానల్‌తో తాజాగా మాట్లాడిన ఆయన.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సెట్లోకి అడుగు పెట్టడమే ప్రశాంతంగా ఓ బ్యాట్, బాల్‌తో వస్తారని చెప్పుకొచ్చారు. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, ట్రెండ్ సెట్టింగ్ మూవీని డైరెక్ట్ చేసిన ఓ రేంజ్ ఉన్న డైరెక్టర్ కావడంతో తాను తొలుత ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు లోపల చాలా భయంతో వెళ్లానని భాస్కర్ తెలిపారు.
ఆ తరువాత ఏం జరిగింది? అసలు ప్రశాంత్ నీల్ సెట్లో ఎలా ఉంటారన్న విషయాలు భాస్కర్ మాటల్లోనే.. ‘‘ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో చిన్న రోల్ దక్కినా చాలు అన్నట్టుగా ఆడిషన్స్‌కి వెళ్లా. ఇచ్చిన సీన్‌ని యాక్ట్ చేసి చూపించా. ఓకే అయిపోయింది. ఇదంతా ఒక ఎత్తైతే.. సెట్లోకి వచ్చాక..ఆయన ముందు యాక్ట్ చేయాలి. అది రియల్ షాట్. వందల మంది మనపై ఫోకస్ చేస్తారు.. మనం యాక్ట్ చేయాలి. ఎక్కువ టేక్‌లు తీసుకోకూడదు. అదొక భయం ఉంటుంది నాకు. ప్రశాంత్ నీల్ గారు ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కదా.. కానీ ఆయన సెట్లో.. టోటల్లీ డిఫరెంట్ పర్సన్’’ అని పేర్కొన్నారు.
Salaar Villain : ప్రశాంత్ నీల్ సెట్లో క్రికెట్ ఆడతారు
ఇంకా భాస్కర్ దుబ్బాక మాట్లాడుతూ.. ‘‘మైన్స్‌లో షూటింగ్. మార్నింగ్ 6 గంటలకు మేమంతా షూటింగ్‌కి వచ్చే వాళ్లం. బొగ్గు గనుల్లో మేకప్ వేసుకుని.. కాస్ట్యూమ్స్ వేసుకుని కూర్చొనే వాళ్లం. ప్రశాంత్ నీల్ సర్ మాత్రం చాలా కూల్ అండ్ కంపోజ్డ్ పర్సన్. ఒక బాలు, బ్యాటుతో వచ్చేవారు. టెక్నికల్ టీం, అసిస్టెంట్స్ సెట్ అంతా రెడీ చేసుకునే వాళ్లు. ఆయన మాత్రం సెట్లో క్రికెట్ ఆడుకుంటూ ఉండేవారు. మళ్లీ సెట్ రెడీ అయిపోయిందంటే మాత్రం సీరియస్‌గా సెట్లోకి వచ్చేవారు. పెద్ద డంపర్పైన నా షూటింగ్. సీన్ అంతా ఎక్స్ప్లైన్ చేశారు..ఆ సీన్ కూడా చాలా సింపుల్‌గా ఆయన యాక్ట్ చేసి చూపించారు. డంపర్ పైన నేను కూర్చుంటే అక్కడకు వచ్చి సీన్ చేసి చూపించేవారు. అందరికీ ఎనర్జీ ఇచ్చి.. పరిగెత్తించి పని చేయించుకుంటారు’’ అని భాస్కర్ దుబ్బాక వెల్లడించారు.