Sleeping: మనలో కొంతమందికి పడుకునే సమయంలో బోర్ల పడుకోవడం అలవాటుగా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు ఎలా పడుకున్నా కానీ కాసేపటి తర్వాత బోర్ల పడుకుంటేనే కానీ వారికి హాయిగా అనిపించదు. ఒకవేళ మీకు కూడా ఇలా బోర్ల పడుకునే అలవాటు ఉంటే.. వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మంచి నిద్ర:
బోర్ల పడుకునే వారికి మామూలుగానే మంచి నిద్రపడుతుంది. దీనికి కారణం ఈ పొజిషన్ లో పడుకుంటే వీపు మరియు మెడలో ఒత్తిడి కలగడం వల్ల మంచి నిద్ర పట్టే అవకాశం ఏర్పడుతుంది.
నొప్పులు వచ్చే అవకాశం:
నిద్రపోయేటప్పుడు బోర్ల పడుకోవడం వల్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బోర్ల పడుకోవడం వల్ల మొహాన్ని ఒక వైపు పెట్టి పడుకోవాల్సి వస్తుంది. మొహాన్ని అప్పుడప్పుడు అటు నుండి ఇటు, ఇటు నుండి అటుగా తిప్పాల్సి ఉంటుంది. ఇలా తిప్పుతుంటే మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంది. పైగా ఇలా పడుకోవడం వల్ల వెన్నెముకకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే భుజాలు కూడా నొప్పికి గురవుతాయి.
ముఖం మీద మడతలు:
బోర్ల పడుకునే అలవాటు ఉన్న వారికి ముఖం మీద మడతలు త్వరగా వస్తాయి. దిండు మీద ముఖాన్ని నొక్కడం వల్ల చర్మం సాగిపోతుంది. దీని వల్ల మొహం మీద మడతలు ఏర్పడతాయి.
Sleeping: గర్భిణీలకు ప్రమాదం:
గర్భిణీ స్త్రీలు బోర్ల పడుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొట్ట మీద బరువు వేసే పొజిషన్ ఇది కాబట్టి బోర్ల పడుకోవడం గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా మానుకోవాలని సూచిస్తున్నారు. గర్భిణీలు ఎడమవైపుకు తిరిగిన పొజిషన్ లో నిద్రపోవడం ఉత్తమం అని సలహా ఇస్తుంటారు.