Sonal Chouhan : బాలయ్య బ్యూటీ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో తన అందాలతో హంగామా చేస్తోంది. హాట్ ఫోటో షూట్ తో తన ఒంపు సొంపులను, వయ్యారాలను ఒలకాబోస్తూ కుర్రాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తోంది. లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన బంగారు వర్ణంలోని చీర తో చేసిన ఫొటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. సోనాల్ చౌహాన్ గోల్డెన్ చీరలో అదరగొట్టింది. ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.

అత్యద్భుతమైన గ్లామర్‌ని ప్రదర్శించడం అనేది ప్రతి ఒక్కరి సాధ్యపడదు, కానీ కొందరికి ఈ కళ బాగా తెలుసు. అలాంటి వారిలో సోనాల్ కూడా ఉంది. నటి సోనాల్ చౌహాన్ అందమైన చీరలో ప్రో ట్రెండ్‌ను అందిస్తోంది.

సోనల్ చౌహాన్ తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం రౌజే షెల్ఫ్‌ల నుండి అందమైన చీరను ఎన్నుకుంది. సేక్విన్స్, థ్రెడ్ అలంకారాల డీటెయిల్స్ తో వచ్చిన చీరను సంప్రదాయంగా కట్టుకుంది సోనాల్. ఈ చీరకు మ్యాచింగ్ గా సీక్విన్ వివరాలతో వచ్చిన డీప్ నెక్ లైన్ స్లీవ్లెస్ బ్లౌజ్ ను జోడించింది. ఈ శారీ కి సెట్ అయ్యేలా స్టేట్‌మెంట్ డ్రాప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.

రీసెంట్ గా ఆరెంజ్ కలర్ సల్వార్ సూట్ వేసుకుని బీచు ఒడ్డున నిలుచుని సూర్యాస్తమయం సమయంలో అందమైన ఫోటోలు దిగింది సోనాల్. ఈ పిక్స్ లో ఎంతో కూల్ గా కనిపించింది బ్యూటీ.

ఈ మధ్యనే వైట్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ లెహంగాను వేసుకొని ట్రెడిషనల్ వేర్ తో కవ్వించింది సోనాల్. ఈ అందమైన లెహంగా సెట్ ను ఫ్యాషన్ డిజైనర్ నీతి అర్నిజా డిజైన్ చేసింది. లెహంగా కు సరిపడే ఆభరణాలను అకోయ జ్యువలరీ నుంచి సేకరించింది. స్టైలిష్ దేవరాజ్ సోనాల్ కు స్టైలిష్ లుక్స్ ను అందించాడు.

సీక్విన్స్, థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ తో వచ్చిన హెవీ డిజైనర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని దానికి జోడిగా అదే డిజైన్స్ పాట్రన్స్ తో వచ్చిన భారీ లేహంగాను ధరించింది. నడుముకు పట్టి పెట్టుకుని తన నాజుకు అందాలను చూపించి కుర్రాలను రెచ్చగొట్టింది సోనాల్. ఈ లెహంగాలో నిజంగా దివి నుంచి దిగివచ్చిన దేవకన్నెలా ఆదురిపోయింది సోనాల్. ఈ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అభిమానులు లైకులు షేర్ల వర్షం కురిపిస్తున్నారు.
