Star Heroes : ఇండస్ట్రీలో స్టార్డమ్ వస్తే చాలు.. తెరముందు, తెర వెనుక సంపాదన కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. వ్యాపార సంస్థలు తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఈ స్టార్ హీరోలను ఎంచుకుని వారికి బ్రాండ్ బాబు హోదాను కట్టబెడుతున్నాయి. స్టార్ హీరో క్యాంపెయిన్ చేశాడంటే ఆ చాలు.. ఆ ప్రాజెక్ట్ రయ్‌మంటూ జనాల్లోకి దూసుకెళుతుందనడంలో సందేహం లేదు. మన హీరోలు సినిమాలతో పాటు అడ్వర్టైజ్మెంట్స్లోనూ అదరగొడుతున్నారు. కొందరికైతే తెరముందు కంటే తెర వెనుక సంపాదనే ఎక్కువ అనడంలో సందేహం లేదు. మొత్తానికి వ్యాపార సంస్థలన్నీ ఎక్కువగా సూపర్ స్టార్ మహేష్ బాబు చుట్టూనే తిరుగుతున్నాయి.
Star Heroes : మహేష్ సుమారు రూ.80 కోట్ల దాకా ఆర్జిస్తున్నాడు..
బ్రాండ్ అంబాసిడర్ అనగానే ఫస్ట్ వినిపించే పేరు మహేష్ బాబు. డజనుకు పైగా వ్యాపార సంస్థలకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఏటా యాడ్స్ ద్వారా సుమారు రూ.80 కోట్ల దాకా ఆదాయం ఆర్జిస్తున్నారని సమాచారం. ఇక నెక్ట్స్ అల్లు అర్జున్. ఈ ఐకాన్ స్టార్ దగ్గరకు కూడా వ్యాపార సంస్థలు క్యూ కడుతున్నాయి. ‘పుష్ప’ చిత్రంతో ఒక్కసారిగా నేషనల్ సెలబ్రిటీగా మారడంతో దేశ వ్యాప్తంగా బన్నీకి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం బన్నీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, విద్యాసంస్థలు, రైడ్ షేరింగ్ కంపెనీలకు బ్రాండింగ్ చేస్తూ.. భారీ పారితోషికం అందుకుంటున్నాడు. ఇక తర్వాతి స్థానంలో మన రౌడీ హీరో ఉన్నాడు. ముఖ్యంగా ఈ యంగ్ హీరో దుస్తులకు సంబంధించిన ప్రచార ప్రకటనల్లో విజయ్ దేవరకొండ ఎక్కువగా కనిపిస్తున్నాడు. ‘రౌడీబ్రాండ్’ పేరుతో కొన్ని దుస్తుల సంస్థలకు.. అలాగే ప్రముఖ కూల్ డ్రింక్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉన్నాడు.
ప్రస్తుతం సెలెక్ట్ మొబైల్ స్టోర్‌కు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. గతంలో అప్పీ ఫిజ్జ్, మలబార్ గోల్డ్ సంస్థలకు ప్రచారకర్తగా ఉన్నారు. ఇక రామ్ చరణ్ వద్దకు సైతం పలు బ్రాండ్లు క్యూ కడుతున్నాయి. ప్రముఖ ఒటీటీ సంస్థకు ఆయన ప్రచారకర్తగా ఉన్నారు. చెర్రీ ఈ యాడ్ ఒక్కదానికే రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్నాడని సమాచారం. ఇక ఇది కాకుండా.. ప్రముఖ ఆహారోత్పత్తుల సంస్థ కోసం అలియాభట్‌తో కలిసి ప్రచారం చేస్తున్నాడు. అలాగే.. స్థిరాస్థి, ఆన్లైన్ మొబైల్ విక్రయ సంస్థలకు చెర్రీ బ్రాండ్ అంబాసిడర్. వైష్ణవ్ తేజ్, వరుణ్‌తేజ్ కొన్ని దుస్తుల సంస్థలకు బ్రాండింగ్ చేస్తున్నారు. మొత్తానికి మన స్టార్ హీరోలు అటు సినిమాలు.. ఇటు అడ్వర్టైజ్మెంట్స్తో ఏడాదికి కోట్లలో కూడబెడుతున్నారు.