Suhani : మనసంతా నువ్వే మూవీ గుర్తుందా? ప్రశ్నే చాలా సిల్లీగా ఉంది కదా.. ఈ సినిమా హీరో ఉదయ్ కిరణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా. ఈ సినిమాలో నటించిన ఉదయ్ కిరణ్ క్రేజ్ ఓ రేంజ్‌కి ఎగిసింది. కేవలం ఉదయ్ కిరణ్ మాత్రమే కాదు.. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో పాటలన్నీ హైలైట్. ఈ పాటల్లో తూనీగా.. తూనీగా అన్న సాంగ్ ఇప్పటికీ బాగా వినిపిస్తుంది. ఇద్దరు చిన్నారులు పాడుకునే పాట కావడంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఆ సినిమాలో చిన్ననాటి రీమాసేన్గా నటించిన సుహాని గుర్తుంది కదా? ఆ అమ్మాయితోనే ఈ పాటను షూట్ చేశారు. ఆ తరువాత ఈ క్యూట్ బేబీ గణేష్.. ప్రేమంటే ఇదేరా.. ఎదురులేని మనిషి తదితర సినిమాల్లో బాలనటిగా.. నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా కూడా నటించి మెప్పించింది. అయితే ఇప్పుడామ్మాయి పెళ్లి జరిగింది. మ్యూజిషియన్, మోటివేషనల్ స్పీకర్ అయిన విభర్ హసీజాతో కలిసి సుహాని ఏడు అడుగులు వేసింది. అతి కొద్ది ముఖ్యులు.. బంధువుల సమక్షంలో వారి వివాహం జరిగింది.
Suhani : పెళ్లి.. రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసిన సుహాని
సుహానీ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు సుహానిని చూసి.. గుర్తు పట్టలేకపోయాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి కొడుకు విషయానికి వస్తే ఢిల్లీకి చెందిన విభర్ హసీజా ‘యువర్స్ ఈవెంట్ పుల్లీ’ అనే కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇన్‌స్టాలో హల్దీ వేడుకల నుంచి పెళ్లి.. రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోల్ని సుహాని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మనసంతా నువ్వే తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా సుహానీని ఎక్కువగా ఆ సినిమా ద్వారానే గుర్తు పెట్టుకుంటారు.