Sushmita Sen : మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ ప్రముఖ నటి సుస్మితా సేన్-లలిత్ మోదీల ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. తామిద్దరం డేటింగ్లో ఉన్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ లలిత్ మోదీ సోషల్ మీడియా వేదిక ప్రకటించడంతో రచ్చ ప్రారంభమైంది. ఒక్కసారిగా ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అసలు వీళ్లిద్దరి వ్యవహారం పెద్దగా ఎవరికీ తెలియదు. ఏదో వీళ్లిద్దరూ పరిచయస్తులు అన్న విషయం తప్ప.. ప్రేమ వ్యవహారం ఒకటి నడుస్తుందన్న విషయం తెలియదు. వచ్చుంటే వీరి పెళ్లి విషయాన్ని లైట్‌గా తీసుకునే వాళ్లు కానీ.. సడెన్‌గా తెలియడం హాట్ టాపిక్‌గా మారింది.
Sushmita Sen: లేటు వయసులో ఈ ఘాటూ ప్రేమ ఏంటి?
‘విశ్వ సుందరి’ కిరీటాన్ని ఇలా గెలుచుకున్న తర్వాత బ్యూటీ క్వీన్‌కి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. వచ్చిన అవకాశానల్లా వాడుకుని మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఆమె అందానికి, నటనకు ప్రేక్షకులతో పాటు ఓ క్రికెటర్, నటులు, బడా వ్యాపారవేత్తలు కూడా దాసోహమయ్యారు. ఈ క్రమంలో సుష్మితా పలువురు నటులు, క్రికెటర్, వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. సుస్మితా సేన్, లలిత్ మోదీ ఇద్దరూ యూత్ ఏమీ కాదు. దీంతో కొందరు నెటిజన్లు అయితే లేటు వయసులో ఈ ఘాటు ప్రేమ ఏంటిని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ సుస్మితా సేన్ ఎంతమందితో డేటింగ్ చేసిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి ప్రియుడు లలిత్ మోదీతో సహా సుస్మిత 9 మందితో సహాజీవనం చేసినట్లు లెక్క తేల్చారు.
అయితే సుస్మిత పదిమందితో ప్రేమలో పడినప్పటికీ ఇప్పటి వరకూ డేటింగ్‌కే పరిమితమైంది. గతంలో క్రికెటర్ వసీమ్ అక్రమ్, నటుడు రణ్‌దీప్ హుడా, డైరెక్టర్ విక్రమ్ భట్, ముద్దాసిర్, మానవ్ మీనన్‌లతో కొన్నేళ్ల పాటు సహాజీవనం చేసింది. బడా వ్యాపారవేత్తలైన రితిక్ ఖాసిన్, సబీర్, సంజయ్ నారంగ్, ఇంతియాజ్‌లతో కూడా సహజీవనం చేసింది. ఇక నిన్న మొన్నటి వరకూ తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మాన్ షాల్‌తో మూడేళ్లు సహాజీవనం చేసింది. కాగా ప్రస్తుతం సుష్మితా వయసు 46 కాగా.. లలిత్ మోదీ వయసు 56 ఏళ్లు. దీంతో నిన్న మొన్నటి వరకూ తన కంటే చిన్నవాడితో డేటింగ్ చేసి.. ఇప్పుడు ముసలోడితో ప్రేమేంటని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.