పలనాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో అధికార యువగళం పాదయాత్ర సమయంలో అధికార పార్టీ రెచ్చగొట్టే ప్రచారం ప్రారంభించింది. అనంతరం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వైకాపా ఫ్లెక్సీలు వెలిశాయి. బహిరంగ సభ నిర్వహించే స్థూపం సెంటరులో దమ్ము, ధైర్యం ప్రతిపక్షంలో ఎవరైనా ఉన్నారా? సొంతంగా పోటీ చేసి గెలిచే దమ్ము ఉందా? అంటూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మంగళవారం WHY NOT 175/175 అంటూ సీఎం జగన్ ఫోటోలతో భారీ హోల్డింగ్ను ఏర్పాటు చేశారు; కాగా విమర్శలు రావడంతో బుధవారం ఉదయం ఆ హోల్డింగ్లను తొలగించి మళ్లీ వినుకొండ డెవలప్మెంట్ పేరుతో హోల్డింగ్ పెట్టారు.
మార్కాపురం రోడ్డు నుంచి కారంపూడి రోడ్డు వరకు ఉన్న ప్రధాన కూడళ్లలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తన అభివృద్ధి కార్యక్రమాల సమాచారంతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. టీడీపీ హయాంలో నాడు-నేడు నియోజకవర్గం ఎలా ఉంది, తాను వచ్చాక ఏం చేశాడో అందులో వివరించాడు. గతంలో ఏ పార్టీ కార్యకలాపాలు సాగినా ఇబ్బడిముబ్బడిగా ఉండేవి, ఇప్పుడు అంతా రాజకీయం చేస్తున్నారు అంటూ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
![వినుకొండలో టీడీపీ,వైసీపీ ఫ్లెక్సీ వార్ 2 వినుకొండలో టీడీపీ,వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/tb-2023-08-03T110456.280.jpg)