బిగ్ బాస్ కొంత మందికి మంచి ఫేమ్ ఇస్తే మరికొంత మంది ఫేమ్ పోయేలా చేసింది. బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం ద్వారా పాపులారిటీ వస్తుందని చాలా మంది భావిస్తూ ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత చాలా ఒరిజినల్ ఆటిట్యూడ్ బయటపడటంతో అంత వరకు ఉన్న అభిమానులని దూరం చేసుకుంటారు. ఎక్కడైనా సరే రియల్ పేస్ బయటపడితే ఇమేజ్ పెరగడానికి, తగ్గడానికి అదే కారణం అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ కారణంగా పాపులారిటీ సొంతం చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.
అలాగే హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న నటి ఉర్ఫీ జావేద్. రకరకాల డ్రెస్సులతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. అలాగే చిరిగిన బట్టలని, పేపర్స్ ని, ఇంట్లో వాడే కూరగాయలని ఇలా అన్నింటిని శరీరం కప్పుకోవడానికి వాడేస్తూ ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోటో షూట్ లు చేసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అలాగే బయటకి వెళ్ళినప్పుడు కూడా ఈమె వేసే డ్రెస్సులు అందరికంటే ప్రత్యేకంగా ఉంటూ ఎట్రాక్ట్ చేస్తూ ఉంటాయి.
ఇలా రకరకాల బట్టలతోనే ఈమె బాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించి నటిగా కూడా అవకాశాలు పెంచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన జీవితంలో ఎదురైనా కష్టాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంది. బిగ్ బాస్ లో పాల్గొనడానికి ముందు వరకు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె పేర్కొంది. కనీసం వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండేవి కావని చెప్పుకొచ్చింది. అలాగే పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయానని చెప్పింది. తొమ్మిదేళ్ళ పాటు ఇలాంటి ఆర్ధిక ఇబ్బందులని ఎదుర్కొన్నానని ఉర్ఫీ జావెద్ చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ తనకి గుర్తింపు ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా ఒప్పుకుంది.