Vidya Balan : బాలీవుడ్ సెలబ్రిటీలందరూ గ్రాండ్ పార్టీస్‌తో దీపావళి సెలబ్రేషన్స్‌ను మొదలుపెట్టేశారు. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, నటి కృతి సనన్, ఆయుష్మాన్ ఖురానాలు తమ నివాసాలలో స్టార్ స్టడెడ్ పార్టీలను నిర్వహిస్తుండగా, బాలీవుడ్ యాక్టింగ్ క్వీన్ విద్యాబాలన్ తన ఇంట్లో వేడుకలను జరుపుకుంటోంది. తాజాగా ఇంట్లో జరిగిన ఓ పూజా వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసింది. పట్టు చీరకట్టుకుని తన సొగసైన రూపంతో అందరి హృదయాలను గెలుచుకుంది విద్యా బాలన్. ఫెస్టివల్ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేస్తోంది. విద్యాబాలన్ శారీ లుక్‌ను చూసిన యంగ్‌స్టర్స్ తమ అమ్మ చీరలను కట్టుకుని దీపావళికి సందడి చేయాలని అని భావిస్తున్నారట.
![Vidya Balan : చీరకట్టుతో కనికట్టు చేస్తున్న డర్టీ పిక్చర్ హీరోయిన్ vidya-balan-inspiring-diwali-festive-fashion-with-silk-saree](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-9.05.28-AM-3.jpeg)
.
Vidya Balan : విద్యా బాలన్‌ను బాలీవుడ్‌లోని ఫ్యాషన్ ప్రియులు క్వీన్ ఆఫ్ శారీస్ అని పిలుస్తారు. కాంజీవరం సిల్క్స్, చేనేత , స్టేట్మెంట్ శారీలను ఎప్పటికప్పుడు అకేషన్‌ను బట్టి కట్టుకుంటూ చీరలపై ఆమెకున్న మమకారాన్ని మనకు తెలియజేస్తుంది. చీరలో కనిపించిన ప్రతి సారీ తన స్టైలిష్ లుక్స్‌తో ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటుంది. ఇక పండుగ వేళ ఏ రేంజ్లో చీరకట్టుతో మెస్మరైజ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విద్యాపాలన్ దీపావళీ సందర్భంగా పట్టు చీర కట్టుకుని ఫోటో షూట్ చేసి అందరికీ ఫెస్టివ్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తోంది. ఈ పిక్స్‌తో పాటుగా ‘ గేరింగ్ అప్ ఫర్ ది ఫెస్టివ్ సీజన్, క్యాండిడ్స్, ఖుషియా ‘ అని క్యాప్షన్‌ను జోడించింది.
![Vidya Balan : చీరకట్టుతో కనికట్టు చేస్తున్న డర్టీ పిక్చర్ హీరోయిన్ vidya-balan-inspiring-diwali-festive-fashion-with-silk-saree](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-9.05.28-AM-5.jpeg)
విద్యాబాలన్ తన ఇంట్లో జరిగిన పూజ కోసం కాంజీవరం పట్టు చీరను కట్టుకుంది. ఆకుపచ్చని రంగులో బ్రాడ్ గోల్డ్ పట్టీ బార్డర్స్‌తో వచ్చిన ఈ చీరతో విద్యాబాలన్ అందరి చూపును తనవైపు తిప్పుకుంది. పల్లూకు వచ్చిన పింక్ అండ్ గోల్డ్ ఎంబ్రాయిడరీ డీటైల్స్ చీరకు మరింత అందాన్ని అందించాయి. ఈ అద్భుతమైన కలర్‌ఫుల్ చీరను సాంప్రదాయంగా కట్టుకుని అదరగొట్టింది విద్యాబాలన్.
![Vidya Balan : చీరకట్టుతో కనికట్టు చేస్తున్న డర్టీ పిక్చర్ హీరోయిన్ vidya-balan-inspiring-diwali-festive-fashion-with-silk-saree](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-9.05.28-AM-2.jpeg)
ఈ చీరకట్టుకు మరింత వన్నెను తీసుకువచ్చేందకు మ్యాచింగ్ పింక్, గోల్డ్ కలర్స్‌తో వచ్చిన యూ నెక్లైన్ హాఫ్ లెన్త్ స్లీవ్స్ , కట్ అవుట్ డీటైల్స్, డోరీలతో వచ్చిన పట్టు బ్లౌజ్‌ను వేసుకుంది. చేతికి మల్టీకర్ గాజులు , మెడలో బంగారపు చైను, నెక్లెస్, చెవులకు మ్యాచింగ్ కమ్మలు పెట్టుకుని ఎంతో అందంగా కనిపించింది విద్యాబాలన్. జుట్టును నున్నగా దువ్వుకుని నుదుటన సింధూరం పెట్టుకుంది. కనులకు బ్లాక్ ఐ లైనర్, మస్కరా వేసుకుని ముఖానికి బొట్టు పెట్టుకుని ట్రెడిషనల్ లుక్స్ తో ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేసింది.
![Vidya Balan : చీరకట్టుతో కనికట్టు చేస్తున్న డర్టీ పిక్చర్ హీరోయిన్ 2 vidya-balan-inspiring-diwali-festive-fashion-with-silk-saree](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-9.05.28-AM.jpeg)