Vijay Devarakonda : ‘అర్జున్‌రెడ్డి’, ‘గీతగోవిందం’తో మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఆ రెండు సినిమాలతో ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఆయన నటించిన ‘లైగర్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడిపేస్తోంది. ఈ క్రమంలోనే ఈ రౌడీ హీరో తతాజాగా ‘కాఫీ విత్ కరణ్’షోలో ప్రత్యక్షమయ్యాడు. ఈ షోకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ షోలో విజయ్ దేవరకొండను హోస్ట్ కరణ్ జోహార్ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. లవ్ అఫైర్ మొదలు అన్ని ప్రశ్నలు సంధించి మన రౌడీ హీరోను ఉక్కిరి బిక్కిరి చేశారు.
Vijay Devarakonda : కష్టసుఖాలపై ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లం..
ఈ స్టార్ హృదయంలో ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి కరణ్ కూడా విజయ్ నుంచి సమాధానం రాబట్టలేకపోయారు. ఈ ప్రశ్నకు తనకు పెళ్లై పిల్లలు పుట్టాక ఆన్సర్ చేస్తానని విజయ్ తెలిపాడు. నటి రష్మికతో రిలేషన్ గురించి జరుగుతోన్న ప్రచారంపై విజయ్ మరోసారి స్పందించాడు. రష్మిక తన డార్లింగ్ అని.. ఆమె అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు. ఈ సందర్భంగా రష్మికతో తనకు ఉన్న రిలేషన్ గురించి మన రౌడీ హీరో మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ ప్రారంభంలోనే రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశా. రష్మిక నాకు మంచి స్నేహితురాలు. తను నిజంగా డార్లింగ్. తనంటే నాకెంతో ఇష్టం. మేమిద్దరం కెరీర్, జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్లం. దానివల్ల మా మధ్య ఒక మంచి అనుబంధం ఏర్పడింది’’ అని అన్నారు.
ఇక రష్మికకు, సమంత కోల్డ్ వార్ జరుగుతోందంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరినీ విజయ్ ఆకాశానికి ఎత్తాడు. ‘ఖుషి’ కోస్టార్ అయిన సమంతపై విజయ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆమె భారతదేశంలోనే అందమైన మహిళ అని, అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసించాడు. తను ‘లైగర్’ హీరోయిన్ అనన్యాపాండేతో డేట్‌కు వెళ్లానని, కాకపోతే అది కేవలం ఫ్రెండ్లీ డేట్ మాత్రమేనని తెలిపాడు. అలాగే బాలీవుడ్ భామ, లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీకపూర్ గురించి కూడా మన రౌడీ హీరో ఈ షోలో స్పందించాడు. జాన్వీకపూర్ చాలా క్యూట్‌గా ఉంటుందని.. ఇప్పటికే పలుమార్లు ఆమెను బయట కలిశానని విజయ్ చెప్పుకొచ్చాడు.