శరీరంలోని ప్రతి అవయవం ఆధీనంలోనే ఉంటేనే గొప్ప నటులు కాగలరు.ఇలాంటి అరుదైన రేర్ క్వాలిటీ కొంతమందిలోనే ఉంటుంది. అలాంటి అరుదైన నటుల్లో మన బలగం మొగిలియ్య అలియాస్ మైమ్ మధు కూడా ఒకరు. అబ్బా ఏం చేశాడ్రా.. చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయ్ అని అంటుంటారు. ఆ సందర్భంలో జరిగే చర్యని రోమాలు నిక్కబొడుచుకోవడం అంటారు.
ఈ చర్య ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరుకూడా చేయలేరు అది సాధ్యం కాదు కూడా ,కానీ కేవలం శరీరంలోని ప్రతి అవయవాన్ని తన ఆధీనంలోనే ఉంచుకునే గొప్ప గొప్ప నటులకు ఇది సాధ్యపడుతుంది. . అలాంటి అరుదైన టాలెంటెడ్ ఉన్న నటుడే మైమ్ మధు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే.. నటనలో కఠోర శిక్షణలో భాగంగా.. తను కావాలనుకున్నప్పుడు రోమాలను నిక్కబొడుచుకునేట్టు చేయడం ఇతనికి మాత్రమే చెల్లింది.మైమ్ ఆర్ట్ రంగంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి ఈయనే.ఇలా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది.
ఇప్పటి వారికి మోహులయ్యా చాల సినిమాలలో నటించారు నిజానికి మైమ్ మధు చేసిన అన్ని పాత్రలు పండాయి. కానీ సరైన గుర్తింపు రాలేదు. నిజానికి బలగం సినిమాలో మొగిలయ్య పాత్ర అద్భుతంగా ఉందని చెప్పాలి. సినిమాల్లో కూడా అంతే. పాత్ర పండిందంటే దాని ప్రతిఫలం కూడా దక్కాలి.
అయితే అతని టాలెంట్‌కి తగ్గ అవకాశాలైతే రావట్లేదనే చెప్పాలి. మొగులయ్య కేవలం నటుడు మాత్రమే కాదు.. నటనలో శిక్షణ ఇచ్చే గురువు.గాలి సంపత్’ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.. మైమ్ కాన్సెప్ట్‌లో ఓ ఎమోషనల్ సీన్ చేస్తారు. ఆ సినిమాలో హైలైట్ సీన్ అది. ఆ చిత్రంలో ఆ సన్నివేశంలో రాజేంద్ర ప్రసాద్‌కి శిక్షణ ఇచ్చి.. డైరెక్ట్ చేసింది మైమ్ మధునే.