చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న చిత్రం “బలగం” .. ఈ సినిమా సాధించిన ఘనత ఆ సినిమాకి వచ్చిన అవార్డ్స్ అండ్ వసూళ్ళని బట్టి చూస్తేనే అర్ధం అవుతుంది. . దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ సినిమాని నిర్మించగా. జబర్దస్త్ కమెడియన్ ఈ సినిమాకి వేణు వెల్డంది దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మార్చి 3వ తేదీన విడుదల అయినా సంగతి తెలిసిందే.
![100 సెంటర్స్ లో 100 రోజులు 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్..... "బలగం"కి మాత్రమే సాధ్యమైన రికార్డు! 2 100 సెంటర్స్ లో 100 రోజులు 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్..... "బలగం"కి మాత్రమే సాధ్యమైన రికార్డు!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/8cb489ec-5222-41a2-b06e-1c8785864309-1.jpg)
బలగం :
విడుదలకు ముందు కమెడియన్ వేణు ని , ఈ సినిమాను లైట్ తీసుకున్నారు చాలామంది . కానీ విడుదల ఐన తొలి రోజునే నుండే హిట్ టాక్ తో దూసుకుపోయిది ఈ సినిమా, ఆ రోజు నుంచి వసూళ్లను .. ఆదరణను పెంచుకుంటూ పోయింది. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అనే టాక్ రావడంతో, గ్రామాల్లో తెరలు కట్టి మరీ ఫ్రీ షోలు వేశారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఆదరణ లభించడం అనేది సామాన్య విషయం కాదు అనే చెప్పాలి
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా 100 సెంటర్స్ లో 100 రోజులను పూర్తి చేసుకుంది మరో కొత్త రికార్డుని సొంతం చేసుకుంది . ఇదే కాకుండా ఈ సినిమా 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను కూడా అందుకోవడం అనితర సాధ్యమైన రికార్డునే అనే చెప్పవచ్చు.తాజాగా ఈ విషయాన్ని వేణు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.