ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా 7/G బృందావన కాలనీ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు మేకర్స్ . ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు .. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించారు. ఇక ఈ సినిమా అప్పట్లో యువతను చాలా ఆకట్టుకుంటోంది . 2004లో 7/G రెయిన్బో కాలనీ పేరుతో తమిళంలో ఒక సినిమా విడుదలై అక్కడ భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకోగా.. అదే ఏడాది తెలుగులో 7/G బృందావన కాలనీ పేరుతో సినిమాను విడుదలు చేసి ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకున్నారు.
![రీ రిలీజ్ కి సిద్ధమైన 7/G బృందావన కాలనీ..! 2 రీ రిలీజ్ కి సిద్ధమైన 7/G బృందావన కాలనీ..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-12.jpg)
ఇక ఈ సినిమా అప్పట్లో యువతను ఎంతలా ఆకట్టుకుంది అంటే ఇందులో నటీనటులుగా నటించిన రవికృష్ణ , సోనియా అగర్వాల్ అద్భుతంగా తమ నటనతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటున్నాయి . యువన్ శంకర్ రాజ అద్భుతంగా ఈ సినిమాకు సంగీతాన్ని కూడా అందించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సోనియా అగర్వాల్ ను దర్శకుడు సెల్వరాఘవన్ ప్రేమించి 0వివాహం చేసుకున్నారు.
ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 22వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు దర్శకుడు యదార్ధ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, అలాగే కొడుకు గురించి ఒక మధ్య తరగతి తండ్రి ఎలా ఆలోచిస్తున్నారు.. అన్న అంశాన్ని కూడా ఎంతో భావోద్వేగంగా డైరెక్టర్ చూపించారు. హీరో తండ్రి పాత్రలో చంద్రమోహన్ లీనమైపోయి నటించారనే చెప్పాలి. ఇక ఇందులో సుమన్ శెట్టి కామెడీ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది . ఇంత అద్భుతమైన సినిమా మళ్లీ 19 ఏళ్ల తర్వాత థియేటర్లోకి రాబోతుండడంతో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.