Benefits of Sleeping on ground: మన ఇల్లలోని పెద్దలు ఇప్పటికే నేల మీద లేదంటే నులక మంచం లేదా పట్టె మంచం మీద పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారికి మనం ఎంత మెత్తటి బెడ్ ఏర్పాటు చేసినా వారికి నేల మీద పడుకోవడం అంటే చాలా ఇష్టం. వైద్యులు కూడా వీలు కుదిరినప్పుడు నేల మీద పడుకోవాలని సూచిస్తుంటారు. మరి నేల మీద పడుకుంటే అంతలా ఏం ప్రయోజనాలు కలుగుతాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
వెన్ను నొప్పి నుండి విముక్తి:
మారిన జీవన విధానం మరియు కూర్చునే పొజిషన్ కారణంగా చాలామందికి వెన్ను నొప్పి వస్తోంది. అయితే దీని కోసం నేల మీద పడుకోవడం ఉత్తమం అని వైద్యులు చెబుతుంటారు. మెత్తగా ఉండే ఉపరితం మీద పడుకుంటే వెన్నునొప్పి తగ్గదని, అందుకే నేల మీద పడుకోవాలని సలహా ఇస్తుంటారు.
మంచి నిద్ర:
మెత్తగా ఉండే బెడ్ మీద కంటే నేల మీద పడుకున్నప్పుడు మన శరీరం పూర్తిస్థాయిలో విశ్రాంతి పొజిషన్ లో ఉంటుంది. అందుకే బెడ్ మీద కన్నా నేల మీద మంచి నిద్రను అనుభూతి చెందుతారు.
ఒత్తిడి దూరం:
నేల మీద పడుకునే వారు బాగా నిద్రపోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వారికి ఎంతో మేలు కలుగుతుంది.
Benefits of Sleeping on ground:
అయితే నేల మీద వృద్ధులు, తీవ్రమైన వెన్నునొప్పి, అలర్జీలు ఉన్న వారు పడుకోకూడదని వైద్యులు సలహా ఇస్తారు. అలాగే కీళ్ల నొప్పులు లేదంటే ఎముకల నొప్పులతో బాధపడే వారు కూడా నేల మీద పడుకోకపోవడం ఉత్తమం అని అంటారు. గర్భణీ స్త్రీలు కూడా నేల మీద పడుకోకూడదని, ఒకవేళ పడుకున్నా ఎక్కువ సేపు పడుకోకూడదని చెబుతుంటారు.