అక్కినేని ఫ్యామిలీలో కూడా నాగార్జున, నాగ చైతన్య మొదట పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక మెగా ఫ్యామిలీ లో అయితే ఏకంగా నలుగురు విడాకులు తీసుకున్నారు.తాజాగా నిహారిక కూడా తన భర్తతో అధికారికంగా విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ఎంతమంది విడాకులు తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు విజయదుర్గ కూడా మొదట పంజా శివ ప్రసాద్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులు పుట్టాక భర్తతో వచ్చే ఇబ్బందులు భరించలేక విడాకులు తీసుకుంది. ఇక ఎన్నో సంవత్సరాలు తల్లి ఒంటరిగా ఉండడం చూడడం ఇష్టం లేని విజయదుర్గా కొడుకులు సాయిధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ఇద్దరు తన తల్లికి మళ్లీ ప్రముఖ డాక్టర్ ని ఇచ్చి పెళ్లి చేశారు.అలాగే శ్రీజ కూడా మొదట ప్రేమించి ఇంట్లో వారిరి కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంది. కానీ ఒక పాపా పుట్టగానే అతనికి విడాకులు ఇచ్చేసింది.
ఆ తర్వాత మళ్లీ కళ్యాణ్ దేవ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకొని అతనికి కూడా దూరంగా ఉంటుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి పెద్దకూతురు సుస్మిత కూడా ఉదయ్ కిరణ్ తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకుంది. ఇక ప్రస్తుతం గత ఆరు నెలలుగా భర్తకు దూరంగా ఉంటున్న నిహారి కొణిదెల ఎట్టకేలకు భర్తతో విడాకులు తీసుకుంటున్న విషయాన్ని బయటపెట్టింది.
ఇక మెగా ఫ్యామిలీలో విడాకుల విషయం అనగానే గుర్తుకువచ్చే మొదటి పేరు పవన్ కళ్యాణ్.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇద్దరు భార్యలకు అధికారికంగా విడాకులు ఇచ్చారు. ఇక ఇదే క్రమంలో ఈ మధ్యకాలంలో అన్న లెజ్నోవా పవన్ కళ్యాణ్ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. అందుకే వీరి విడాకుల వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.