మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కి డిజాస్టర్ అయిన మూవీ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చి మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. ఇక వీకెండ్ పూర్తయ్యే సరికి థియేటర్స్ అన్ని ఖాళీ అయిపోయాయి. దీంతో మెగాస్టార్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ మూవీ మారిపోయింది. ఇక రామ్ చరణ్, మెగాస్టార్ కలిసి హిట్ కొట్టాలని భావించిన వారికి నిరాశ ఎదురైంది. ఇక ఈ సినిమా డిజాస్టర్ కి కారణం పూర్తిగా కొరటాల శివ అనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపించింది. మెగాస్టార్ కూడా పలు ఇంటర్వ్యూలలో ఆచార్య మూవీ కంప్లీట్ డైరెక్టర్ ఛాయస్ అని, అతను ఎలా కావాలంటే అలా మేము నటించామని చెప్పారు.
ఆ అవుట్ పుట్ కి పూర్తి బాధ్యత కొరటాల శివదే అనే విధంగా చిరంజీవి మాట్లాడారు. రామ్ చరణ్ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చిన క్రేజ్ కాస్తా కొరటాలకి ఆచార్య మూవీతో పోయింది. అయితే ఎన్టీఆర్ మాత్రం కొరటాల రైటింగ్ మీద నమ్మకంతో అతనిని సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆచార్య సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన మణిశర్మ కూడా ఆ సినిమా ఫ్లాప్ కి కారణం కొరటాల అనే విధంగా మాట్లాడారు.
ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని ఆచార్య బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగోలేదనే విమర్శలు వచ్చాయి కదా అని ప్రశ్నకి సమాధానం చెప్పారు. చిరంజీవితో నేను చాలా సినిమాలు చేసాను. ఆయనకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో నాకొక క్లారిటీ ఉంది. అలాగే ప్రిపేర్ చేశాను. అయితే దర్శకుడు కొరటాల శివ మాత్రం పూర్తిగా మార్చేసి తాను అనుకున్న విధంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేయాలని కోరాడు. నేను కూడా అతను కోరుకున్నట్లే చేసి ఇచ్చాను. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఛాయస్ మాత్రమే నా ఛాయస్ కాదని చెప్పాడు. దీంతో ఆచార్య ఫ్లాప్ కి కారణం కొరటాల శివ అనే ప్రచారానికి మణిశర్మ మాటలు మరింత బలం ఇచ్చినట్లు అయ్యింది.