Actor Poornima: చిత్ర సీమలో అలనాటి నటి పూర్ణిమ ముఖం అందరికీ సుపరిచితమే. కొంటె పిల్లగా, అల్లరి పిల్లగా పాత సినిమాల్లో చాలా వాటిల్లో నటించిన ఈమె.. వివాహం అనంతరం నటనకు గుడ్ బై చెప్పారు. తర్వాత ఇటీవల కాలంలో తల్లి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక అంశాలను పంచుకున్నారు. తన జర్నీ గురించి, సినిమాలు, ఫ్యామిలీ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
మదర్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఇష్టపడతాను..
పెళ్లయ్యాక సినిమాల్లో నటించడం మానేశానని నటి పూర్ణిమ తెలిపారు. ప్రస్తుతం సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కలుగుతోందన్నారు. రీసెంట్ గా కొన్ని సినిమాల్లో నటించానన్నారు. లై సినిమాలో నితిన్ తల్లిగా పని చేయడం సంతృప్తినిచ్చిందని చెప్పారు. నితిన్ చాలా బాగా మాట్లాడతాడని, మంచి అబ్బాయి అని మెచ్చుకున్నారు పూర్ణిమ. అలాగే రామ్ చరణ్ తల్లిగా చేయడం అంటే ఇష్టమని చెప్పారు. ఫ్యూచర్ లో అవకాశం వస్తే తప్పక నటిస్తానని తెలిపారు.
తనది పెద్దలు కుదిర్చిన సంబంధమేనని వెల్లడించారు పూర్ణిమ. తన పెళ్లి సమయంలో కాస్త అయోమయ పరిస్థితులు ఉండేవన్నారు. సినిమాల్లో నటిస్తున్నా కాబట్టి.. తనను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చే వారు కాదని తెలిపారు. ఇలా సుమారు ఏడెనిమిది మంది వచ్చి వెళ్లిపోయారని, ఇక విసుగు వచ్చి కుమారిగానే ఉండిపోవాలని డిజైడ్ అయ్యి ఉండేదన్నారు. చివరకు మా వారు వచ్చారు.. అని తెలిపారు. తమ వివాహం జరిగే ముందే సినిమాల్లో నటన ఆపేయాలని మా వారు కోరారు.. అని పూర్ణిమ తెలిపారు. మీరు నటించమన్నా నేను నటించను.. అని తాను చెప్పినట్లు తెలిపారు. విశాఖ బీచ్ లో తాము తొలిసారి కలిసి మాట్లాడుకున్నామన్నారు.
Actor Poornima:
మేలో పెళ్లి చూపులు జరిగితే నవంబర్ లో పెళ్లయ్యిందని, ప్రతి రోజూ మాట్లాడుకొనేవాళ్లమని చెప్పారు. తన భర్తకు చినుకులా రాలి.. నదులుగా సాగి.. నీ ప్రేమ.. నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ.. అనే పాటను అంకితం చేస్తానంటూ పాట పాడి వినిపించారు పూర్ణిమ. పిల్లల విషయంలో తన భర్త క్రమశిక్షణతో పెంచారని తెలిపారు. తన తనయుడు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడని, తనకు ఓ మనవరాలు కూడా ఉందని వెల్లడించారు. ఇప్పుడున్న హీరోయిన్లలో తమన్నా అంటే ఇష్టమని తెలిపారు. త్రిష కూడా నచ్చుతుందన్నారు. హీరో నాని అంటే ఇష్టపడతానని, నాని సినిమాలు ప్రైమ్ లో కూడా చూస్తుంటానని వివరించారు.