కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. త్వరలోనే పండంటి బిడ్డను కనబోతోంది కాజల్. గత వారంలోనే కాజల్ ఇంటిలో సీమంతం వేడుక జరిగింది. అయితే పుట్టబోయే బిడ్డ కోసం కాజల్ బాగా కష్టపడుతోంది. బిడ్డ ఆరోగ్యంగా, సురక్షితంగా పుట్టాలని కాజల్ బాగానే వర్కవుట్లు చేస్తోందని ఈ వీడియో లో తెలుస్తుంది. తాజాగా కాజల్ ఆ వీడియోను షేర్ చేసింది. అందులో కాజల్ చేసిన వర్కవుట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
కాజల్ ఫస్ట్ లాక్డౌన్ అనంతరం తన చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. కరోనా నిబంధనల కారణంగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకుంది. కాజల్ పెళ్లి ఫోటోలు, మాల్దీవుల్లోని హనీమూన్ ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లూ వ్యాపారానికి కూడా సాయం చేస్తుంది. ఇద్దరూ కలిసి బిజినెస్ ను ముందుకు తీసుకెళ్తున్నారు.
కాజల్ తన వ్యక్తిగత జీవితం కోసం సినిమా కెరీర్‌ను కాస్త పక్కకు పెట్టింది. తల్లి కానుండటంతో కొన్ని సినిమాలు ఒప్పుకోలేదు కాజల్ . తనకు పుట్టబోయే బిడ్డ కోసం ముందు నుంచీ ఎంతో జాగ్రత్తగా ఉంటూ వస్తుంది. నిత్యం వర్కవుట్లు చేస్తుంది. అయితే తాజాగా కాజల్ సోషల్ మీడియా లో ఓ వీడియోను షేర్ చేసింది.
‘నేను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వ్యక్తినే. నా జీవితంలో ఎక్కువగా వర్కవుట్లు చేస్తూ ఉంటాను. ఎటువంటి సమస్యలు లేకుండా ప్రసవించడం కోసం చిన్నపాటి వర్కవుట్లు, ఏరోబిక్స్ వంటివి చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటివి చెయ్యాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఇంత ఫిట్‌గా ఉండటానికి ఈ ఏరోబిక్స్ నాకు ఎంతో సాయపడుతుంది’ అంటూ తన ట్రైనర్‌తో కలిసి చేసిన వర్కవుట్ల వీడియో ను కాజల్ షేర్ చేసింది.