యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్ బాగోలేదనే టాక్ కారణంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. మీమ్స్ క్రియేట్ చేసి మరీ ట్రోల్ చేశారు. కొంతమంది అయితే అదే పనిగా సినిమాపై దుష్ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. సినిమా యాంటీ హిందీ ఎలిమెంట్ తో ఉందని, రామాయణాన్ని వక్రీకరించారు అంటూ బాయ్ కట్ చేయాలనే డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. రావణుడి మీద ఎందుకనో అమాంతం చాలా మందికి ప్రేమ పుట్టుకొచ్చింది. అసలు బ్రాహ్మణుడైన రావణుడిని ఎలా అంత కిరాతకుడుగా చూపిస్తారు అంటూ హడావిడి చేస్తున్నారు. రాముడిని బాగానే చూపించిన, రావణుడిని చూపించిన విధానం మాత్రం నచ్చలేదని ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఇది కొందరు కావాలని పనికట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం అని అర్ధమవుతుంది. టీజర్ మీద మెయిన్ గా వినిపించే నెగిటివ్ గ్రాఫిక్స్ వర్క్ బాగోలేదని, అయితే ఈ మూవీ త్రీడీలో ఆవిష్కరిస్తున్నారు. ఈ కారణంగా మామూలుగా యుట్యూబ్ లో విజువల్ అంత గ్రాండియర్ గా కనిపించలేదు. ఇన్ని నెగిటివ్ ప్రచారాలు, ట్రోల్స్ మధ్యలో కూడా ఆదిపురుష్ రికార్డులు సృష్టించింది. ఎవరూ అందుకోలేని స్థాయిలో ఆల్ టైం సెన్సేషన్ రికార్డులని ఆదిపురుష్ టీజర్ తో ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 24 గంటల్లోనే అన్ని బాషలలో కలిపి టీజర్ 100 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.
ఇంతకంటే ముందు కూడా హైయెస్ట్ ఫస్ట్ డే టీజర్ వ్యూస్ రికార్డ్ కూడా ప్రభాస్ రాధేశ్యామ్ పేరున ఉంది. దానిని బ్రేక్ చేస్తూ ఆదిపురుష్ టీజర్ ప్రభంజనం సృష్టించింది. వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఈ టీజర్ యుటూబ్ లో కొనసాగుతుంది. ఇప్పటికి ఆదిపురుష్ హిందీ టీజర్ అయితే 75 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తుంది. ఇండియన్ సినిమా హిస్టరీతో ఇంత నెగిటివిటీలో కూడా ఒకే ఒక్క టీజర్ తో దేశం మొత్తం చర్చించుకునే విధంగా చేయడంతో పాటు బాలీవుడ్ హీరోలకి సాధ్యం కానీ రికార్డ్ ని సృష్టించి ఔరా అని యంగ్ రెబల్ స్టార్ అనిపించాడు. దీనిని బట్టి అతని ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ బాగోలేదని టీజర్ కి వస్తున్న స్పందన నేపధ్యంలో దర్శకుడు గ్రాఫిక్స్ వర్క్ మీద మరింతగా శ్రద్ధ పెట్టి బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.