స్టైలిష్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు అక్కినేని అఖిల్. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి కెరియర్ లో ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో కమర్షియల్ హిట్ పడలేదు. బాలీవుడ్ హీరో రేంజ్ లో అతని లుక్ ఉన్న కూడా ఎందుకనో అతని కెరియర్ మాత్రం స్టార్ హీరో రేంజ్ లో సాగడం లేదు. ఏదో తన ప్రయత్నంలో లోపం లేకుండా గట్టిగానే కష్టపడుతున్న సరైన కంటెంట్ పడకపోవడంతో దమ్మున్న హీరో కాస్తా ఎవరేజ్ హీరోగా ఉండిపోయాడు.
ఇప్పటి వరకు అతను కెరియర్ లో చేసిన నాలుగు సినిమాలలో రెండు సినిమాలు ఏవరేజ్ టాక్ సొంతం చేసుకోగా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆయా సినిమాలలో కంటెంట్ కంటే అతని ఇమేజ్ ని బిల్డప్ చేసేందుకే అన్నట్లు ఉండటంతో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అయితే ఇప్పుడు సక్సెస్ ఫుల్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పాన్ఇండియా రేంజ్ లో ఏజెంట్ అని మూవీ అఖిల్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెడుతున్నారు. సైరా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి నుంచి రాబోతున్న మూవీ ఇదే. దీనితో తనని తాను పాన్ ఇండియా రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ స్టైలిష్ దర్శకుడు సైతం సిద్ధం అయ్యాడు. అందుకు తగ్గట్లుగానే అదిరిపోయే పవర్ ఫుల్ సబ్జెక్టు తో యూనివర్శల్ కాన్సెప్ట్ తో ఏజెంట్ మూవీని తెరకెక్కించారు.
ఈ సినిమాలో మలయాళీ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని ప్రేక్షకుల ఉందుకి తీసుకొచ్చారు. ఈ టీజర్ చూస్తుంటే గూస్ బాంబ్స్ రావడం పక్కా అనేట్లు విజువల్స్ ఉన్నాయి. అలాగే హీరో అఖిల్ లుక్ కూడా కండలు తిరిగిన శరీరంతో హాలీవుడ్ రేంజ్ హీరోల రేంజ్ లో ఉంది. అదే సమయంలో స్టలిష్ గా కూడా ఉంది. ఈ సినిమా టీజర్ చూస్తుంటే చాలా కాలంగా అఖిల్ కి అందని ద్రాక్షగా ఉన్న బ్లాక్ బాస్టర్ హిట్ పడ్డట్లే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంట్టుంది అనేది చూడాలి. అఖిల్ ని తెరపై ఆవిష్కరించడానికి కథ డిమాండ్ కి తగ్గట్లు నిర్మాతలు ఖర్చు చేసినట్లు విజువల్స్ చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.