కోలీవుడ్ జంట ఐశ్వర్య, ధనుష్ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ధనుష్ తో విడాకులు తీసుకున్న ఐశ్వర్య ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమవుతుందంటూ ఓ వార్త బయటకు వచ్చింది.సౌత్ ఇండస్ట్రీ సూపర్‌స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య, స్టార్ హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు కాగా, గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించి సడెన్ షాక్ ఇచ్చారు. 18 ఏళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురం ముక్కలు కావడంతో అభిమానులు సైతం షాక్ అయ్యారు.
![తమిళ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి! 2 తమిళ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Z-02.jpg)
ఇక ధనుష్ భార్య ఐశ్వర్యను అందరూ రజనీకాంత్ కూతురుగానే గుర్తిస్తారు. ఇక రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకెళ్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ధనుష్ భార్య ఐశ్వర్య కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. తాజాగా ఐశ్వర్య రెండో పెళ్లికి రెడీ అవుతుందని, కోలీవుడ్ యంగ్ హీరోతో ఐశ్వర్య ప్రేమలో ఉందని, అతన్నే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఒక్కసారిగా బయటికి రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదంటూ చెబుతుంటే, మరికొందరేమో ఐశ్వరకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటంటూ? కామెంట్స్ చేస్తున్నారు.