Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్డమ్ తగ్గేదేలే అంటూ ఖండాంతరాలు దాటింది. పుష్ప సినిమాతో నార్త్ లేదు సౌత్ లేదు ప్రపంచమంతా ఒక్క ఊపు ఊపేసాడు ఈ ఐకానిక్ స్టార్. తనదైన నటనతో మాస్ లుక్ తో, వైవిధ్యమైన పాత్రల్లో ఒదిగిపోయి ఇదిరా సామీ నటన అంటే అని సినీ ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు తన సత్తాను చూపించాడు. తగ్గేదేలే అన్న ఒకే ఒక డైలాగ్ ఆ సినిమాలలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ని పరిచయం చేసింది. రియల్ లైఫ్ లోనూ తగ్గేది లే అంటూ దూసుకుపోతున్నాడు ఈ యువ హీరో. పుష్ప సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ కు చాలా మంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. మాస్ లుక్ లో బన్నీ ఇరగదీసాడంటూ పొగడ్తలతో ముంచేశారు ప్రశంసల వర్షం కురిపించారు.
మలయాళం లో మన హీరో కి ఏ మాత్రం క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు.పుష్ప తో అంతకుమించిన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ బన్నీ నటనకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. నిజానికి బన్నీ స్టైలిష్ స్టార్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. మొదటి సినిమాతో ఎదుర్కొన్న అన్ని మైనస్ పాయింట్స్ ను ఇప్పుడు ప్లస్ గా మార్చుకొని వరల్డ్ ఫేమస్ స్టార్ గా మారాడు. తాజాగా పుష్ప టు మూవీకి సంబంధించిన ప్రమోషన్ ని రష్యా నుంచి మొదలు పెట్టేసింది అట్టి దీంతో అల్లుకీ ఎంత క్రేజ్ ఉందో ఓవరాల్ లుక్ లో చూడాల్సిందే. మరి ఇంత క్రేజ్ ఉన్న బన్నీని ఎవరైనా వదులుకుంటారా చెప్పండి. సౌత్ డైరెక్టర్లు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అల్లు అర్జున్ తో కలిసి పనిచేయాలని ఉందంటూ తన మనసులోని మాటను బయట పెట్టేసాడు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి న్యూ మూవీ సర్కస్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎలక్ట్రిక్ మ్యాన్ గా రన్వీర్ సింగ్ సర్కస్ మూవీ లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలిసిపోతుంది. మూవి ప్రమోషన్ నిమిత్తం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రోహిత్ శెట్టి సౌత్ హీరోల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తనకు దక్షిణాదిలో ఉన్న అందరూ స్టార్లతో సినిమా తీయాలని కోరికగా ఉందని చెప్పకనే చెప్పేసాడు రోహిత్. అందులోనూ మరీ ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విజయ్, కార్తీలతో స్పెషల్ గా సినిమా తెరకెక్కించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. టాప్ డైరెక్టర్ నోటా బన్నీ మాట వినబడడంతో అభిమానులు ఫుల్ ఖుషి చేసుకుంటున్నారు.