టాలీవుడ్ లో లెజెండ్రీ హీరోగా, మెగాస్టార్ గా, ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక అతని మార్గంలో నడుస్తూ మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తర్వాత మెగాస్టార్ ఇమేజ్ తో సక్సెస్ అయిన మరో హీరో అంటే అల్లు అర్జున్ అని చెప్పాలి. ఓ వైపు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడుగా, మరో వైపు మెగాస్టార్ అల్లుడు అనే ఇమేజ్ తో బన్నీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన డాన్స్ , నటనతో అద్బుతమైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాలో బన్నీ చెప్పిన కొన్ని డైలాగ్స్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి మెగాస్టార్ చిరంజీవినే రోల్ మోడల్ అని చాలా సందర్భాలలో చెప్పారు. చిరంజీవి డాన్స్ లు చూస్తూ పెరగడంతో తమలో కూడా ఆ టాలెంట్ వచ్చిందని చెప్పారు. ఇప్పటికి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ సొంతం చేసుకున్న మెగాస్టార్ ఇమేజ్ ని మాత్రం మరిచిపోడు. ఇదిలా ఉంటే తాజాగా బన్నీ ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ డాన్స్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. చిరంజీవి వలన జీవితంలో ఒకసారి దారుణంగా నష్టపోయానని చెప్పుకొచ్చారు. ఇంద్ర సినిమాలో వీణ స్టెప్ కోసం ఏకంగా 17 సార్లు సినిమా చూసాను. ఆ నమ్మకంతో తన ఫ్రెండ్స్ తో వీణ స్టెప్ వేసినపుడు చిరంజీవి పక్కన సోనాలిబింద్రే లేదని 25 వేల రూపాయిలు పందెం కాసాను. సోలో స్టెప్ అని నేను చాలా నమ్మకంతో పందెం కాసాను. అయితే తరువాత చూస్తే అందులో హీరోయిన్ ఉంటుంది. నేను చిరంజీవి గారి డాన్స్ చూస్తూ ఆ ట్రాన్స్ లో హీరోయిన్ ఉందనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు. అలా ఏకంగా 25 వేలు బెట్ కాసి పోగొట్టుకున్న అని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారాయి.