Allu arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా నార్త్ ఆడియన్స్ కి కూడా అల్లు అర్జున్ భాగా రీచ్ అయ్యాడు. బాలీవుడ్ హీరోలకి కూడా సాధ్యం కాని స్టైలిష్ హీరో అనే బ్రాండ్ గా అల్లు అర్జున్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మళ్ళీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
అలాగే బాలీవుడ్ దర్శకుల కథలు కూడా బన్నీ వింటున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. సౌత్ లో అత్యధికంగా సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్న హీరోగా అల్లు అర్జున్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా అతను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో మరో ఫీట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం సౌత్ లో అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా నెంబర్ వన్ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడు.
పుష్ప సినిమాకి ముందు 14 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ప్రస్తుతం 20 మిలియన్స్ కి రీచ్ అయ్యింది. దీంతో సౌత్ లో అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా బన్నీ టాప్ లో నిలిచాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో అల్లు అర్జున్ ఉన్నారు. మొదటి సినిమా కంటే మరింత గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.