దేశాన్ని మాత్రమే కాదు విదేశాలలో సైతం తన సత్తా చాటిన సినిమా పుష్పకు నిన్న జాతీయ అవార్డు లలో అల్లు అర్జున్ ఉత్తమ్ హీరోగా గెలుపొందిన విషయం మనకి తెలిసిందే. దేశమంతా ఇతన్ని మంచి పొగడ్తలతో ముంచెత్తించారు , కాగా నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ఈ రోజు బ్రహ్మానందం ఇంట్లో ప్రత్యక్షము అయ్యాదంట . అయితే ఎందుకు అల్లు అర్జున్ బ్రహ్మి ఇంటికెళ్ళాడు అన్న విషయంలో కొందరికి సందేహాలు ఉన్నాయని బాగా తెలుస్తోంది.
![బ్రహ్మానందం ఇంట్లో అల్లు అర్జున్ ప్రత్యక్షం … ! 2 బ్రహ్మానందం ఇంట్లో అల్లు అర్జున్ ప్రత్యక్షం … !](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-23-1.jpg)
కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం గత వారంలో బ్రహ్మానందం కుమారుడికి వివాహం జరుగగా, అందుకు అల్లు అర్జున్ కొన్ని పనుల కారణంగా హాజరు కాకపోవడంతో … ఈ రోజు వచ్చి కలిసి వారికి శుభాకాంక్షలు తెలియచేశాడు. ఇక ఈ ఇంట్లో అల్లు అర్జున్ గంటన్నర సేపు వారితో ముచ్చటించారు. అనంతరం బ్రహ్మనందం అల్లు అర్జున్ ను సత్కరించారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది.