Amy Jackson: టాలీవుడ్ లో ఎవడు సినిమాలో హీరోయిన్ గా నటించిన అందాల భామ అమీ జాక్సన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. బ్రిటిష్ అమ్మాయి అయిన అమీ జాక్సన్ తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అంతకుముందు మోడలింగ్ రంగంలో రాణిస్తున్న బ్యూటీ తర్వాత ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఇక సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ తర్కెక్కించిన ఐ సినిమాలో అమీ జాక్సన్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ప్లాప్ అయిన కూడా అమీ జాక్సన్ కి మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన రోబో 2.0 సినిమాలో కథానాయక నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఇక తర్వాత బ్రిటన్ లోనే వ్యాపారవేత్త జార్జ్ తో డేట్ లో కొనసాగింది. వారిద్దరికీ ఒక కొడుకు కూడా పెళ్లి కాకుండానే పుట్టాడు. ఇక కుమారుడు పుట్టిన మూడేళ్ల తర్వాత మొదటి బాయ్ ఫ్రెండ్ కి ఆమె బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం బ్రిటిష్ నటుడు ఎడ్ విస్టివిక్ తో ఆమె ప్రేమాయణం కొనసాగిస్తుంది. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా తన ప్రియుడి ఫోటోలను ఆమె బయట పెట్టింది. అతనికి ముద్దులు పెడుతూ ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది.
హ్యాపీ వాలెంటైన్స్ డే బేబీ మీ అంతులేని ప్రేమ కృతజ్ఞతలు అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి దానికి ఫోటోలను జత చేసింది. ఇక అమీ జాక్సన్ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో, వెబ్ సిరీస్లలో నటిస్తుంది. అయితే పెళ్లి కాకుండానే ఒక బిడ్డను కానీ మరలా ఇప్పుడు మరో బాయ్ ఫ్రెండ్ తో అమీ జాక్సన్ కనిపించడంతో సోషల్ మీడియాలో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.