లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ అయిన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. పెద్దగా పర్ఫార్మెన్స్ లేకున్నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో కేవలం అవకాశాలను సొంతం చేసుకుంటుంది. పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో కూడా ఈ బ్యూటీకి కరణ్ జోహార్ రిఫరెన్స్ తోనే అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమాతో ఫ్లాప్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ సినిమాతో పాటు డ్రీమ్ గర్ల్ 2 మూవీలలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో హీరోయిన్స్ అఫైర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడే వచ్చిన హీరోయిన్స్ కూడా ఏదో ఒక హీరోతో ప్రేమాయణం నడిపిస్తూ ఉంటారు.
కొంతకాలానికి వారికి బ్రేక్ అప్ చెప్పేసి ఇంకొకరితో తిరుగుతారు. ఫైనల్ గా ఎవరినో పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి కథలు బిటౌన్ లో కుప్పలుగా ఉంటాయి. పార్టీ కల్చర్ ఎక్కువగా ఉండటంతో ఈ హీరో, హీరోయిన్స్ ప్రేమకథలు కూడా ఎక్కువగా బయటకి వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే అనన్య పాండే మొన్నటి వరకు ఇషాన్ కట్టర్ తో ప్రేమాయణం నడిపించింది. షాహిద్ కపూర్ తమ్ముడుగా ఈ కుర్ర హీరో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం బాగానే అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. ఇషాన్ ముందుగా జాన్వీ కపూర్ తో కొంత కాలం చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగాడు.
తరువాత ఆమెకి బ్రేక్ అప్ చెప్పేసి అనన్య పాండేని పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ బ్యూటీకి కూడా బ్రేక్ అప్ చెప్పేసి మరో హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇక అనన్యా పాండే కూడా నేనేం తక్కువ తినలేదు అంటూ మరోహీరోతో డేటింగ్ మొదలు పెట్టింది. ఆషికి2తో అందరికి చేరువ అయినా ఆదిత్యా కపూర్ తో అనన్య పాండే డేటింగ్ లో ఉందని బిటౌన్ లో వినిపిస్తున్న మాట. వీరిద్దరూ కలిసి పబ్ లకి కలిసి వెళ్తూ కెమెరాలకి చెక్కుతున్నారు. దీంతో వీరు డేట్ లో ఉన్నారని బిటౌన్ మీడియా గట్టిగా చెబుతుంది. అయితే ఈ విషయంపై ఇద్దరో ఎవరూ ఖండించకపోవడం విశేషం.