Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో నందు కోపంతో తులసితో మాట్లాడుతాడు. సామ్రాట్ తో స్నేహం ఉంటే నీ వరకే చూసుకోవాలి అని.. ఇంటి వరకు తీసుకురావద్దు అని అంటాడు. ఆ మాటలు విని సామ్రాట్ అక్కడి నుంచి వెళ్తుండగా వెంటనే తులసి ఆపి.. మీరు నా కోసం వచ్చారు నేను చెప్పినప్పుడే వెళ్ళండి అని.. ఎవరో చెబితే వెళ్లకూడదు అని అంటుంది.
ఇది నా ఇల్లు అంటూ.. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది. అంటే నేను లాస్య మధ్యలో కలుగచేసుకుని మాట్లాడుతుంది. ఇక పరంధామయ్య తన మనసులో ధైర్యంగా ఉంది అని అనుకుంటాడు. ఇక నందు ఇల్లు నీది కావచ్చు కానీ ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు అనటంతో.. వెంటనే తులసి నా వాళ్ళు కూడా అని అంటుంది.
వెంటనే లాస్య మనకి ఇక్కడ సపోర్ట్ లేదు అని అనుకుంటుంది. ఇక అక్కడి నుంచి లాస్య వాళ్ళు బయలుదేరుతుండగా అనసూయ ఆపుతుంది. ఇక నందుకు సపోర్ట్ గా మాట్లాడుతుంది. నా కొడుకుని ఎవరైనా ఏమైనా అంటే నేను సహించలేను అని అంటుంది. నందు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అని లేదంటే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని అంటుంది.
ఆ తర్వాత తులసి సామ్రాట్ గురించి ధైర్యంగా మాట్లాడుతుంది. ఈరోజు వరంగల్ కి వెళ్తున్నాము అని.. కారులో పక్కపక్కన కూర్చొని వెళ్తున్నాము అని ధైర్యంగా మాట్లాడుతుంది. సామ్రాట్ తో మా వాళ్ళు మిమ్మల్ని బాధ పెడితే క్షమాపణలు అని చెబుతుంది. ఆ తర్వాత సామ్రాట్ అక్కడ నుంచి వెళ్తాడు. ఇక పరంధామయ్య కాస్త వెటకారం చేస్తూ మాట్లాడుతాడు.
ఇక లాస్య నందుతో కోపంగా అరుస్తుంది. ఆ తర్వాత అనసూయ జరిగిన విషయం తలుచుకుంటూ ఉంటుంది. పరంధామయ్యతో తులసి గురించి మాట్లాడుతుంది. కేవలం సామ్రాట్ తో మాట్లాడొద్దని అన్నాను అని.. అంతేకానీ నాకు ఎటువంటి పంతం లేదు అని అంటుంది. ఇక మీ సపోర్ట్ తో తులసి ఇంకా రెచ్చిపోతుంది అని.. విలువ ఇవ్వకుండా పోతుంది అని అంటుంది.
అలా వారిద్దరు తులసి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు తులసి, బట్టలు సర్దుకుంటూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అంకిత అక్కడినుంచి వెళ్లగా అదే సమయంలో సామ్రాట్ తులసి కి ఫోన్ చేసి మాట్లాడుతాడు. సామ్రాట్ తులసి తో ఫోన్ మాట్లాడిన తర్వాత నవ్వుకుంటూ ఉంటాడు. అదంతా చూసి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ విసిపోతాడు.
మరుసటి రోజు ఉదయాన్నే నందు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతాడు. ఇక ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను అని లాస్యతో అంటాడు. లాస్య మాటలు ఈరోజు మీ ఇంటికి వెళ్ళాలి అని అనటంతో నందు నేను రాను అంటాడు. ఇక లాస్య ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇక తులసి అందంగా రెడీ కావడంతో అనసూయ చూసి బాగా తయారయింది అని అనుకుంటుంది.
Intinti Gruhalakshmi:
అప్పుడే సామ్రాట్ కార్ సౌండ్ వినిపించడంతో.. తులసి అనసూయ కి చెప్పి బయలుదేరుతుంది. అనసూయ కాస్త కోపంగా మాట్లాడుతుంది. ఇక తులసి బయలుదేరుతుండగా లాస్య దంపతులు ఎంట్రీ ఇస్తారు. వెంటనే మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. అంత లాస్య సరదాగా బయటికి వెళ్దామనిఅంటుంది. ఇక వెంటనే ఇంట్లో వాళ్ళు తులసి లేకుండా మేము రాము అని అంటారు. అలా కాసేపు అక్కడ ఈ సన్నివేశం సాగుతూ ఉంటుంది.