ఏడుస్తూ వీడియో పెట్టిన అనసూయ..దారుణంగా ట్రోలింగ్?
టాలీవుడ్ స్టార్ నటి, ప్రముఖ యాంకర్ అనసూయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్లు చేసింది యాంకర్ అనసూయ… ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ గా సెటిల్ అయిపోయింది. ముఖ్యంగా జబర్దస్త్ లాంటి షో లలో… యాంకర్ గా మంచి గుర్తింపు ని తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్.ఇక గత కొన్ని రోజుల కిందట జబర్దస్త్ యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ చేసింది. పుష్ప సినిమాలో నటించిన తర్వాత అనసూయ భరద్వాజ్ కు చాలా సినిమాలలో ఛాన్సులు వస్తున్నాయి.
దానికి తగ్గట్టుగానే అనసూయ అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని తన కెరీర్లను ముందుకు తీసుకెళ్తుంది . ఇది ఇలా ఉండగా తాజాగా తన సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టింది ఈ యాంకర్ అనసూయ భరద్వాజ్. వెక్కివెక్కి ఏడుస్తూ … అందరికీ ఇచ్చేలా ఒక వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కండ్ల నిండా కన్నీళ్లతో విలవిలలాడిపోయింది యాంకర్ అనసూయ.
అసలు తనకు ఏమైందో అనే విషయాన్ని చెప్పకుండానే… దారుణంగా ఏడ్చేస్తోంది. అయితే ఈ వీడియోకు ఓ ఆప్షన్ కూడా ఇచ్చింది. ప్రపంచంలో ఎంత గొప్పవారికైనా బాధలు ఉంటాయి… సమస్యలు వస్తాయి… కానీ వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలి. బాధ వస్తే ఏడవాలి. ఏడవటంలో ఎలాంటి తప్పులేదు అంటూ అనసూయ తన పోస్టులో బాగా వివరించింది. కంటి నిండా ఏడ్చిన తర్వాత ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని అదే జీవితం అంటూ పేర్కొంది.
దీంతో నెటిజన్స్ అలాగే ఆమె ఫ్యాన్స్ కూడా ఏమైంది అనసూయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆమెను ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. మొన్నటి వరకు బికినీలు వేసుకొని తిరిగావు అని … ఇప్పుడు అనుభవించు అంటూ కొంతమంది కామెంట్స్ చేసారు … అసలు ఏమైంది నీకు… నువ్వు అలా ఏడు వద్దు అంటూ కొంతమంది ఓదార్చుతున్నారు అనసూయ ని . విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నిన్ను ఏమైనా అన్నారా అని అంటూ మరి కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు. మరి దీనిపై అనసూయ ఎలా స్పందిస్తుందో అనేది చూడాలి.