తెలుగు సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తెరకెక్కిస్తూ ఒక వైపు హీరోల ఫ్యాన్స్‌ను, సాధారణ సినీ ప్రేక్షకులను మెప్పిస్తున్న నేటి తరం యువ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ తనను నందమూరి అగ్ర కథానాయకుడు ఒకరు ర్యాగింగ్ చేశారని చెప్పారు. ఇంతకీ అనిల్ రావిపూడిని ర్యాగింగ్ చేసిన సదరు నందమూరి స్టార్ హీరో ఎవరు అని తెలుసుకుందాం, అనిల్ రావిపూడి.. సినీ రైటర్‌గా తన సినీప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్‌తో దర్శకుడిగా మారారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరిదృష్టిలో పడ్డారు అనిల్.
తొలి సినిమా పటాస్ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ‘పటాస్ పూర్తయ్యే సమయానికి ఎన్టీఆర్ రోజూ నా ఆఫీసుకి వచ్చేవారు. ఆయన నన్ను మామూలుగా ఆడుకునేవారు కాదు. ర్యాగింగ్ చేసేవారు. ర్యాగింగ్ అంటే ఏడిపించడం మాత్రం కాదు. అల్లరి చేసేవాళ్లు, జోక్ చేసేవాళ్లు. నాకు కథ చెప్పు అనేవారు. సినిమా రిలీజ్ కాలేదు కదా ఏం చెప్పాలని అడిగితే.. అంటే నాకు కథ చెప్పవా? అనేవారు. ఆయనతో గడిపిన క్షణాలను నేను ఎప్పటికీ మరచిపోలేను’’ అని అన్నారు అనిల్ .
ఇలా నందమూరి స్టార్ హీరోతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు ఆ ఇంటర్వ్యూ. తొలి సినిమా పటాస్ హిట్ అయిన తర్వాత సుప్రీమ్,ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో వరుస విజయాల డైరెక్టర్‌గా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఎఫ్ 3 మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను మే 27న విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారంటూ సమాచారం.